డీ అడిక్షన్ కేంద్రాల ఏర్పాటు చారిత్రాత్మక మైలురాయి
ABN, Publish Date - Jul 05 , 2025 | 03:59 AM
నేరాలు పాల్పడి జైలుకు వచ్చినవారిలో పరివర్తన తీసుకురావడమే లక్ష్యంతో రాష్ట్ర జైళ్లలో డీ అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి, నేషనల్ లీగల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
హైదరాబాద్/సైదాబాద్/యాదగిరిగుట్ట, జూలై 4 (ఆంధ్రజ్యోతి): నేరాలు పాల్పడి జైలుకు వచ్చినవారిలో పరివర్తన తీసుకురావడమే లక్ష్యంతో రాష్ట్ర జైళ్లలో డీ అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి, నేషనల్ లీగల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. చంచల్‌గూడ జైలులో నివృత్తి డీ అడిక్షన్ సెంటర్‌ను శుక్రవారం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. మత్తుకు బానిసైన ఖైదీలకు వైద్య చికిత్స, కౌన్సిలింగ్‌ల ద్వారా మంచి పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంగా డీ అడిక్షన్ కేంద్రాల ఏర్పాటు అభినందనీయమని చెప్పారు.
జస్టిస్ సుజోయ్‌పాల్ మాట్లాడుతూ ఖైదీలు మత్తు వ్యసనాన్ని అధిగమించి వారి జీవితాలను పునర్నించడానికి సహాయపడే వాతావరణం చంచల్‌గూడ జైలులో ఉందని ప్రశంసించారు. కాగా, అంతకు ముందు యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడిని జస్టిస్ సూర్యకాంత్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేద ఆశీర్వచనం చేశారు. గర్భాలయంలో స్వయంభువులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని, చిత్రపటాన్నిన్యాయమూర్తికి అందజేశారు. కాగా, బాలల హక్కుల రక్షణ అంశంపై ‘వాయిస్ ఫర్ ది వాయిస్ లెస్’ అనే పేరుతో శని, ఆదివారాల్లో రాష్ట్ర స్థాయి స్టేక్ హోల్డర్ల సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ సూర్యకాంత్ ముఖ్య అతిఽథిగా హాజరుకానున్నారు. ఈ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, హై కోర్ట్ చీఫ్ జస్టిస్ సుజోయ్ పాల్, డీజీపీ జితేందర్ తదితరులు పాల్గొననున్నారు.
Updated Date - Jul 05 , 2025 | 03:59 AM