ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జస్టిస్‌ సురేందర్‌కు ఘన వీడ్కోలు

ABN, Publish Date - Jun 14 , 2025 | 04:09 AM

మద్రాస్‌ హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్‌ కే సురేందర్‌కు శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు ఘనంగా వీడ్కోలు పలికారు.

హైదరాబాద్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): మద్రాస్‌ హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్‌ కే సురేందర్‌కు శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు ఘనంగా వీడ్కోలు పలికారు. మొదటి కోర్టు హాల్‌లో జరిగిన ఫుల్‌ కోర్టు సమావేశంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజోయ్‌పాల్‌, ఏజీ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ జస్టిస్‌ సురేందర్‌ అందించిన సేవలను కొనియాడారు. ఆయన తన పదవీకాలంలో దాదాపు 23 వేల కేసులను పరిష్కరించారని తెలిపారు. కేసుల పరిష్కారంలో దేశవ్యాప్తంగా 13వ స్థానంలో నిలిచినట్లు తెలిపారు.

హైకోర్టు బార్‌ అసోసియేషన్‌లో జరిగిన సమావేశంలో సీనియర్‌ న్యాయవాది వీ రఘునాథ్‌ మాట్లాడుతూ.. జస్టిస్‌ సురేందర్‌ బదిలీ ఏకపక్షంగా జరిగిందని పేర్కొన్నారు. నల్లకోటు వేసిన న్యాయవాదులుగా సమాజంలో ఎవరికి అన్యాయం జరిగినా మాట్లాడుతామని, అదే విధంగా జడ్జీలకు అన్యాయం జరిగినా ప్రతిఘటించి తీరుతామని స్పష్టంచేశారు. జస్టిస్‌ సురేందర్‌ మాట్లాడుతూ తొలుత జియాలజిస్టుగా, పైలట్‌గా కావాలని ప్రయత్నాలు చేశానని.. కానీ విధి తనను న్యాయవాదిగా తీర్చిదిద్దిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఏ జగన్‌, కార్యదర్శి విజారత్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 04:09 AM