అసమానతలు ఉన్నంత కాలం ప్రజాపోరాటాలు సజీవం : జస్టిస్ బి.చంద్రకుమార్
ABN, Publish Date - May 30 , 2025 | 03:55 AM
ఆర్థిక అసమానతలు, దోపిడీ, నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు, మహిళలపై హింస బాలకార్మిక వ్యవస్థ కొనసాగినంత కాలం ప్రజా ఉద్యమ పోరాటాలు సజీవంగానే..
బర్కత్‌పుర, మే 29 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక అసమానతలు, దోపిడీ, నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు, మహిళలపై హింస బాలకార్మిక వ్యవస్థ కొనసాగినంత కాలం ప్రజా ఉద్యమ పోరాటాలు సజీవంగానే ఉంటాయని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్రకుమార్ స్పష్టం అన్నారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో కేంద్రం తక్షణమే కగార్ ఆపరేషన్‌ను నిలిపివేసి కాల్పుల విమరణను ప్రకటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన సదస్సులో జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను కుటుంబసభ్యులు, బంధువులకు అప్పగించకుండా పోలీసులే ఖననం చేయడం, మృతదేహాల వద్ద సంబరాలు జరుపుకోవడం హిందూ ధర్మానికి పూర్తి విరుద్ధమని విమర్శించారు.
Updated Date - May 30 , 2025 | 03:55 AM