ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jani Master: జానీ మాస్టర్ సంచలన ట్వీట్..

ABN, Publish Date - Jan 29 , 2025 | 01:06 PM

Jani Master Tweet: టాలీవుడ్ టాప్ డ్యాన్స్ మాస్టర్ జానీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. జానీ మాస్టర్ విషయంలో ఏదో ఒక అంశం హాట్ టాపిక్‌గా మారుతోంది. తాజాగా జానీ మాస్టర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. మరి ఆ పోస్ట్ ఏంటో చూద్దాం..

Jani Master

హైదరాబాద్, జనవరి 29: టాలీవుడ్ టాప్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారారు. జూనియర్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో అరెస్టై.. బెయిల్‌పై బయటకొచ్చిన ఆయన.. తాజాగా సంచలన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సెన్సేషనల్‌గా మారింది. సోషల్ మీడియాలో పోస్ట్ ఎవరిని ఉద్దేశించి చేశారు.. ఆయన అంతలా రియాక్ట్ అవడానికి కారణం ఏంటి ఈ కథనంలో తెలుసుకుందాం.

అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న జానీ మాస్టర్.. కొన్నాళ్లు జైలు జీవితం గడిపారు. ఆ తరువాత బెయిల్‌పై బయటకొచ్చారు. కానీ, ఈ వ్యవహారంతో జానీ మాస్టర్ స్టార్ డమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. బాధిత యువతి ‘మా’ అసోసియేషన్‌లో ఫిర్యాదు ఇవ్వడంతో.. ‘మా’ అసోసియేషన్ ఆయనపై చర్యలు తీసుకుంది. డ్యాన్స్ అసోసియేషన్ యూనియన్ అధ్యక్షుడిగా జానీ మాస్టర్‌ని తొలగించింది. ఆ తరువాత నేషనల్ అవార్డ్ సైతం వెనక్కి తీసుకున్నారు. అయితే, జానీ మాస్టర్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించిన క్రమంలో.. మా అసోసియేషన్ కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నికలు నిర్వహించింది. ఈ ఎన్నికలపై జానీ మాస్టర్ కోర్టును ఆశ్రయించారు. ఇక్కడ కూడా జానీ మాస్టర్‌కు ఎదురు దెబ్బ తగిలింది. పిటిషన్‌ను కొట్టేసింది. ఈ క్రమంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు కోర్టు తీర్పును వక్రీకరించి ప్రచారం చేస్తున్నారంటూ జానీ మాస్టర్ రియాక్ట్ అయ్యాడు. వారి తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ.. ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.


జానీ మాస్టర్ పోస్టు సారాంశం ఇదే..

‘తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్ల పై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుంది. ముందస్తుగా నాకు తెలియకుండా జరిగిన యునియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకి సంబంధించి వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా, నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతూ ఉన్నారు. మీరేది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారేమో కానీ అసలు తీర్పు వివరాలు బయటకి వచ్చిన రోజున మీ నిజస్వరూపమేంటో, దేనికోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారని అందరికీ అర్థమవుతుంది. ఆ రోజు ఎంతో దూరం లేదు. న్యాయమే గెలుస్తుంది, నిజం అందరికీ తెలుస్తుంది.’

Updated Date - Jan 29 , 2025 | 01:07 PM