Indiramma Housing Scheme: జాబితాలో పేరున్నా దక్కని ఇందిరమ్మ ఇల్లు
ABN, Publish Date - May 02 , 2025 | 06:09 AM
ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని మనస్తాపంతో మంచిర్యాల జిల్లా రైతు రవీందర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గ్రామ కమిటీ ఎంపిక చేసిన జాబితాలో పేరు ఉండి చివరిదశలో తొలగించడంతో అతను ఆవేదనకు లోనయ్యాడు.
మంచిర్యాల జిల్లాలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
కోటపల్లి, మే1 (ఆంధ్రజ్యోతి): ఇల్లులేని నిరుపేదల కోసం రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఇందిరమ్మ ఇంటి పథకం అమలుచేస్తోంది. ప్రతి పల్లెలోనూ గ్రామ కమిటీ ఖరారుచేసిన వారికే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని నిబంధన కూడా పెట్టింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామ కమిటీ ఎంపిక చేసిన 27 మందితో కూడిన తొలి జాబితాలో కుమ్మరి రవీందర్ అనే వ్యక్తి పేరు ఉంది. కానీ ఇళ్ల సంఖ్య పదికి తగ్గించాలని ఆదేశాలు రావడంతో ఆయన పేరును తొలగించారు. దీంతో తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని మనస్తాపంతో రవీందర్ బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ను మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రవీందర్‌కు భార్య కళావతితోపాటు ఇద్దరు పిల్లలున్నారు. గ్రామంలో వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న రవీందర్ సొంతిల్లు లేకపోవడంతో ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ, గ్రామ కమిటీ వల్లే తనకు ఇల్లు దక్కడం లేదని తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.
ఇవి కూడా చదవండి
ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం
PM Modi AP Visit: ప్రధాని మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారు
Read Latest AP News And Telugu News
Updated Date - May 02 , 2025 | 06:09 AM