ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Shivaraj Chauhan: జన్యుమార్పిడి కొత్త వరి వంగడాలొచ్చేశాయ్‌!

ABN, Publish Date - May 06 , 2025 | 04:40 AM

దేశీయంగా అభివృద్ధి చేసిన జన్యుమార్పిడి కొత్త వరి వంగడాలు రెండింటిని న్యూఢిల్లీలో సోమవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ చౌహాన్‌ ఆవిష్కరించారు.

  • 6 ఏళ్ల పరిశోధన ఫలితం.. 2 రకాల వంగడాల ఆవిష్కరణ

  • న్యూఢిల్లీలో విడుదల చేసిన కేంద్రమంత్రి శివరాజ్‌ చౌహాన్‌

హయత్‌నగర్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): దేశీయంగా అభివృద్ధి చేసిన జన్యుమార్పిడి కొత్త వరి వంగడాలు రెండింటిని న్యూఢిల్లీలో సోమవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ చౌహాన్‌ ఆవిష్కరించారు. ఈ మేరకు అటారీ (అగ్రికల్చర్‌ టెక్నాలజీ అప్లికేషన్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌) డైరెక్టర్‌ షేక్‌ ఎన్‌ మీరా ఒక ప్రకటనలో వెల్లడించారు. సాంబా మసూరి, ఎంటీయూ 1010 అనే రెండు ప్రధాన వరి వంగడాలను మెరుగుపరిచేందుకు 2018లో కీలక పరిశోధనను భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐసీఏఆర్‌) ప్రారంభించిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.


ఈ వంగడాలతో 19ు మేర దిగుబడి పెరుగుతుందని, గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలు 20ు మేర తగ్గుతాయని.. 7500 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల సాగునీరు కూడా ఆదా అవుతుందని వివరించారు. జన్యుక్రమంలో మార్పులు చేర్పుల ద్వారా వరి వంగడాలను అభివృద్ధి చేసిన తొలి దేశంగా భారత్‌ నిలిచిందని, ఇది శాస్త్రీయ పరిశోధన ఆవిష్కరణల రంగంలో కొత్త ఆరంభానికి సూచిక అని పేర్కొన్నారు. దేశాన్ని ప్రపంచ ఆహార కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Updated Date - May 06 , 2025 | 04:40 AM