స్వదేశీ శక్తిలో భారత్ ముందంజ
ABN, Publish Date - Jun 07 , 2025 | 03:21 AM
దేశ రక్షణ రంగం స్వదేశీ శక్తితో ముందకు వెళ్తోందని ఏపీ ప్రభుత్వ ఎయిర్ స్పేస్, డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ గౌరవ సలహాదారుడు జి. సతీ్‌షరెడ్డి అన్నారు.
డ్రోన్, రేడార్లు, మిసైళ్లతో శక్తిని చాటిన ఇండియా
వేల కోట్ల విలువైన రక్షణ సామగ్రి ఎగుమతి
ఎస్సార్ వర్సిటీ స్నాతకోత్సవంలో సతీ్‌షరెడ్డి
ఎంఎం కీరవాణికి డాక్టరేట్ ప్రదానం
హసన్‌పర్తి, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): దేశ రక్షణ రంగం స్వదేశీ శక్తితో ముందకు వెళ్తోందని ఏపీ ప్రభుత్వ ఎయిర్ స్పేస్, డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ గౌరవ సలహాదారుడు జి. సతీ్‌షరెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌లోని ఎస్సార్ విశ్వవిద్యాలయంలో చాన్సలర్ ఎ. వరదారెడ్డి అధ్యక్షతన శుక్రవారం 3వ స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సతీ్‌షరెడ్డి మాట్లాడుతూ.. భారత్‌లో విద్యారంగం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రతి సంవత్సరం 1.4 మిలియన్ల ఇంజనీర్లు తయారవుతున్నారని పేర్కొన్నారు.
పబ్లికేషన్లు, పీహెచ్‌డీల పరంగా భారత్ 3వ స్థానంలో ఉందని చెప్పారు. రక్షణ రంగంలో డ్రోన్లు, రేడార్లు, మిస్సైళ్ల వ్యవస్థల ద్వారా భారత్ తన శక్తిని ప్రపంచానికి చాటిందని తెలిపారు. గత ఏడాది రూ.24వేల కోట్ల విలువైన రక్షణ సామగ్రిని ఎగుమతి చేసిందని ఆయన పేర్కొన్నారు. కీరవాణి మాట్లాడుతూ తెలుగు సినిమాకు అందించిన గొప్ప కవిత్వ సేవలను గుర్తించి ఎస్సార్ వర్సిటీ మొదటి స్నాతకోత్సవం సందర్భంగా చంద్రబో్‌సకు గౌరవ డాక్టరేట్‌ను అందజేసినట్లు పేర్కొన్నారు. 3వ స్నాతకోత్సవంలో డాక్టరేట్‌ను తాను అందుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎస్సార్ వర్సిటీ వీసీ దీపర్ గార్గ్, రిజిస్ట్రార్ ఆర్. అర్చనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 07 , 2025 | 03:21 AM