ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Heavy Rains: రాష్ట్రంలో ఈ నెలంతా వర్షాలే !

ABN, Publish Date - Jul 03 , 2025 | 05:11 AM

రాష్ట్రంలో ఈ నెల (జూలై)లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం వెల్లడించింది.

  • దేశ వ్యాప్తంగానూ అదే పరిస్థితి

  • రాష్ట్రంలో మరో 5 రోజులు వానలు:వాతావరణ శాఖ

హైదరాబాద్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఈ నెల (జూలై)లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం వెల్లడించింది. అలాగే దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని తెలిపింది. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా ఉండే సూచనలున్నాయని వెల్లడించింది. అయితే, కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది.

మరోవైపు తెలంగాణపై నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం మహబూబాబాద్‌, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిలాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసినట్లు వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం సగటు వర్షపాతం 2 సెంటీమీటర్లు నమోదైనట్లు తెలిపింది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని పేర్కొంది. 7 వరకు యెల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

Updated Date - Jul 03 , 2025 | 05:11 AM