BREAKING: కేసీఆర్‌కు షాక్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!
ABN, Publish Date - Aug 04 , 2025 | 02:51 PM
కేసీఆర్‌కు తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా సిట్ ఏర్పాటు యోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు సమాచారం.
హైదరాబాద్, ఆగస్టు 4: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు (KCR) తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission)నివేదిక ఆధారంగా సిట్ ఏర్పాటు యోచనలో రేవంత్ (Revanth)సర్కార్ ఉన్నట్లు సమాచారం. కాగా ఇటీవల కాళేశ్వరం ఇచ్చిన రిపోర్ట్‌లో దోషిగా కేసీఆర్ పేరుని అధికారులు ప్రస్తావించారు. కేసీఆర్ ఇచ్చిన అదేశాల మేరకే తాము పనిచేసినట్లు అధికారులు విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే... ఈనెల మూడో వారంలో 3 రోజులపాటు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట జరిగిన అవినీతి, అక్రమాలపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు.
కేసీఆర్ ఏం చేస్తారు?..
కాళేశ్వరం రిపోర్ట్ పై కేసీఆర్ ఎలా స్పందిస్తారనే దానిపై తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా తాము ముందుకు వెళ్తామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇప్పటికే అటు ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆందోళనగా ఉన్న కేసీఆర్.. ఇటీవల హరీష్ రావు, కేటీఆర్ తో సమావేశం అయ్యారు. కాళేశ్వరం రిపోర్ట్, పార్టీ అంతర్గత సమస్యలపై చర్చలు జరిపారు. ఇక.. త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా? లేదా? అనేది వేచి చూడాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ అండ్ కోవి డైవర్షన్ పాలిటిక్స్.. మంత్రి పార్థసారథి ఫైర్
ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలను ఖండించిన టీటీడీ చైర్మన్
Updated Date - Aug 04 , 2025 | 02:57 PM