ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tenth Class Exams: పదో తరగతి విద్యార్థులకు తీపి కబురు చెప్పిన తెలంగాణ సర్కార్..

ABN, Publish Date - Mar 07 , 2025 | 07:58 PM

తెలంగాణ వ్యాప్తంగా మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకూ పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 09:30 గంటల నుంచీ మధ్యాహ్నం 12:30 గంటల వరకూ పరీక్షలు నిర్వహించనున్నారు.

10th Class Hall Tickets

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మార్చి 21 నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి హాల్ టికెట్లను విడుదల చేసింది. తమ అధికారిక వెబ్ సైట్ www.bse.telangana.gov.in నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఎస్ఎస్‌సీ బోర్డు తెలిపింది. హాల్ టికెట్లు కావాల్సిన విద్యార్థులు మార్చి 7 నుంచి నేరుగా సైట్ నుంచి వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పింది. మరోవైపు జిల్లా విద్యాశాఖ అధికారుల ద్వారా కూడా ప్రతి పాఠశాలకూ ఇప్పటికే హాల్ టికెట్లను చేరవేసినట్లు వెల్లడించింది. ప్రతి ఒక్క విద్యార్థీ పరీక్ష గదికి తప్పకుండా వాటిని తీసుకెళ్లాలని సూచించింది.


కాగా, ఈనెల 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకూ పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 09:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకూ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మరోవైపు విద్యార్థులకు ఏమైనా అనుమానాలు ఉన్నా, సమాచారం కావాలన్నా ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయం నంబర్ 040-23230942కు ఫోన్ చేసి వివరాలు తెలుకోవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి:

Mumbai: భార్య వేధింపులకు మరో టెకీ సూసైడ్.. అతను రాసిన లెటర్ చూస్తే కన్నీళ్లు ఆగవు..

BIG Mistake in MLC Elections: ఆ ఒక తప్పు హరికృష్ణను ఓడించిందా..!

Updated Date - Mar 07 , 2025 | 07:59 PM