Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్
ABN, Publish Date - May 13 , 2025 | 08:57 PM
Sravan Rao: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల్లో ఒకరైన శ్రవణ్ రావుపై సీసీఎస్‌లో కేసు నమోదు అయింది. దీంతో అతడిని పోలీసులు విచారణకు పిలిచారు. అనంతరం అతడిని అరెస్ట్ చేశారు.
హైదరాబాద్, మే 13: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడి శ్రవణ్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. చీటింగ్ కేసులో ఆయనపై అభియోగాలు రావడంతో.. కేసు నమోదు చేశారు. ఈ మేరకు విచారించేందుకు నోటీసులు ఆయనకు అందజేశారు. కాగా మంగళవారం సీసీఎస్ పోలీసుల ఎదుట శ్రవణ్ రావు విచారణకు హాజరయ్యారు. ఈ విచారణ అనంతరం శ్రవణ్ రావును పోలీసులు అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.
గతంలో అఖండ ఎంటర్ ప్రైజస్ సంస్థను రూ. 6 కోట్ల మేర మోసం చేసినట్లు శ్రవణ్ రావుపై ఆరోపణలున్నాయి. ఈ మేరకు బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టులోని న్యాయమూర్తి ఎదుట అతడిని హాజరుపరిచాలని నిర్ణయించారు. అందుకోసం అతడిని న్యాయమూర్తి ఇంటికి తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..
For Telangana News And Telugu News
Updated Date - May 13 , 2025 | 09:07 PM