ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Saraswati Pushkaralu: ఈ నెల 15 నుంచి సరస్వతి పుష్కరాలు

ABN, Publish Date - May 06 , 2025 | 02:03 PM

Saraswati Pushkaralu: తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ నుంచి సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. అయితే పుష్కర ఘాట్‌లకు దగ్గర్లోనే హెలికాప్టర్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కరాలకు వచ్చిన భక్తులు కాళేశ్వరం ఆలయం, పుష్కర ఘాట్‌లు, చుట్టూ ఉన్న పచ్చటి అందాలను గగనతలం నుంచి వీక్షించేలా రాష్ట్ర ప్రభుత్వం ‘జాయ్‌రైడ్‌’ను ఏర్పాటు చేస్తోంది.

Saraswati Pushkaralu

హైదరాబాద్: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఈ నెల 15 తేదీ నుంచి 26వ తేదీ వరకూ సరస్వతి పుష్కరాలు (Saraswati Pushkaralu) జరగనున్నాయి. దీనిపై మంగళవారం సచివాలయంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu), కొండా సురేఖ (Konda Surekha) ముఖ్య అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పుణ్య స్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ భేటీలో సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. జరగబోయే సరస్వతి పుష్కరాల్లో హెలికాప్టర్‌ (Helicopter) ప్రయాణం అందుబాటులోకి రానుంది. పుష్కరాలకు వచ్చిన భక్తులు కాళేశ్వరం ఆలయం, పుష్కర ఘాట్‌లు, చుట్టూ ఉన్న పచ్చటి అందాలను గగనతలం నుంచి వీక్షించేలా రాష్ట్ర ప్రభుత్వం ‘జాయ్‌రైడ్‌’ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం ఒకేసారి 6 గురు ప్రయాణించేందుకు వీలుగా ఎయిర్‌బస్‌ హెచ్‌-125 మోడల్‌ హెలికాప్టర్‌ను వినియోగించనుంది. టికెట్‌ ధరను ఒక్కొక్కరికీ రూ.4,500 చొప్పున ఖరారు చేయగా.. ప్రయాణ సమయాన్ని 6-7 నిమిషాలుగా నిర్ణయించారు. హెలికాప్టర్‌ ప్రయాణాలకు అవసరమైన సాంకేతిక అనుమతులు, ఇతరత్రా వ్యవహారాలు మొత్తం ఇప్పటికే పూర్తయ్యాయి. ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకే జాయ్‌రైడ్‌లను నిర్వహించనున్నారు. కాగా, ఈ హెలికాప్టర్‌ ప్రయాణాల బాధ్యతలను బెంగళూరుకు చెందిన ఓ సంస్థకు అప్పగించారు. జాయ్‌రైడ్‌లకు అవసరమైన సాంకేతిక అనుమతులను సదరు సంస్థే ఏర్పాటు చేసుకుంటుంది.

Also Read: లిక్కర్ స్కాం.. సంచలన విషయాలు వెలుగులోకి..


సరస్వతి పుష్కరాలకు హెలీకాఫ్టర్ ఏర్పాటు..

పుష్కర ఘాట్‌లకు దగ్గర్లోనే హెలికాప్టర్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దేవాదాయ, పర్యాటకశాఖలతో పాటు సివిల్‌ ఏవియేషన్‌ విభాగం సంయుక్తంగా హెలికాప్టర్‌ ప్రయాణాలను పర్యవేక్షించనున్నాయి. గతంలో మేడారం జాతరలోనూ దేవాదాయశాఖ హెలికాప్టర్‌ ప్రయాణాలను ఏర్పాటు చేసింది. అప్పుడు భక్తుల నుంచి మంచి ఆదరణ రావడంతో సరస్వతి పుష్కరాల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. కాగా, బెంగళూరు నుంచి కాళేశ్వరానికి మళ్లీ ఇక్కడి నుంచి అక్కడకు హెలికాప్టర్‌ ఖాళీగా వచ్చి, వెళ్లాల్సిన నేపథ్యంలో రూ.20 లక్షలను ప్రభుత్వం చెల్లించనుంది. అదే విధంగా హెలిప్యాడ్‌కు దగ్గర్లో అంబులెన్స్‌లు, అగ్నిమాపక బృందాలను అందుబాటులో ఉంచనుంది. హెలికాప్టర్‌ ప్రయాణ బాధ్యతలను తీసుకున్న సంస్థ గతంలో 15 వేల మంది భక్తులకు జాయ్‌రైడ్‌లను అందించిందని వెల్లడించింది. టికెట్ల బుకింగ్‌ కోసం టోల్‌ ఫ్రీ నంబరును త్వరలో ప్రకటించనున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

సివిల్ డిఫెన్స్ డ్రిల్‌పై కీలక సమావేశం..

ఏపీపీఎస్సీ నియామకం కేసులో కీలక పురోగతి...

For More AP News and Telugu News

Updated Date - May 06 , 2025 | 02:03 PM