ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kishan Reddy: దేశ విద్యావ్యవస్థలో ప్రధాని మోదీ అనేక మార్పులు తెచ్చారు: కిషన్ రెడ్డి

ABN, Publish Date - Jul 18 , 2025 | 09:57 PM

ప్రధాని నరేంద్రమోదీ దేశ విద్యావ్యవస్థలో అనేకమార్పులు తీసుకొచ్చారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పీజీ సీట్ల నుంచి మెడికల్ సీట్ల వరకు పెంచి.. ప్రతీ పేద విద్యార్థికి ఉన్నత విద్యను దగ్గర చేశారని..

Kishan Reddy

హైదరాబాద్, జులై 18: ప్రధాని నరేంద్రమోదీ దేశ విద్యావ్యవస్థలో అనేకమార్పులు తీసుకొచ్చారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పీజీ సీట్ల నుంచి మెడికల్ సీట్ల వరకు పెంచి.. ప్రతీ పేద విద్యార్థికి ఉన్నత విద్యను దగ్గర చేశారని చెప్పారు. ప్రపంచ దేశాలన్నింటికీ కంటే మెరుగైన విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ప్రభుత్వం పని చేస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు.

నరేంద్ర మోదీ గారిని ప్రధాన మంత్రి అభ్యర్థి గా ప్రకటించిన తర్వాత మొదటి కార్యక్రమం కేశవ్ మెమోరియల్‌లో జరిగిందని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఈ దేశానికి మొదటిసారిగా రాష్ట్రపతి అయిన గిరిజన ఆడబిడ్డ, ఆదివాసి బిడ్డ ద్రౌపతి ముర్ము రాష్ట్రపతి అయిన తర్వాత ఈ ఇన్స్టిట్యూషన్ కు రావడం జరిగిందని, ఈ సంస్థ అంత ప్రతిష్టాత్మకమైనదని కిషన్ రెడ్డి అన్నారు. నేడు ఈ కార్యక్రమానికి కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రావడం సంతోషకరమని కిషన్ రెడ్డి చెప్పారు. ఇవాళ హైదరాబాద్ లోని KMITలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.

ఉన్నతమైన విద్య ప్రమాణాలతో అత్యంత క్రమశిక్షణ విలువలతో కూడిన విద్యను అందించే కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ తన పార్లమెంట్ నియోజకవర్గంలో ఉందని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నానని కిషన్ రెడ్డి అన్నారు. గత కొన్నేళ్లుగా 80వ దశకం నుంచి ఈ ప్రాంగణంలో అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని, వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని కిషన్ రెడ్డి చెప్పారు. కేశవరెడ్డి విద్యాసంస్థ దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూషన్ గా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుందని మంత్రి తెలిపారు.

ఇవి కూడా చదవండి

యూట్యూబ్ హైప్‌ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 18 , 2025 | 09:57 PM