Uttam Slams BRS: ఎన్‌డీఎస్‌ఏ నివేదిక చూసి సిగ్గుపడండి.. బీఆర్‌ఎస్‌పై ఉత్తమ్ ఆగ్రహం
ABN, Publish Date - Apr 25 , 2025 | 03:55 PM
Uttam Slams BRS: గులాబీ పార్టీపై మంత్రి ఉత్తమ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు తప్పులపై బతకాలని బీఆర్‌ఎస్ అనుకుంటోందని.. అది కుదరదని స్పష్టం చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 25: బీఆర్‌ఎస్‌పై (BRS) మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై (Kaleshwaram Project) ఎన్‌డీసీఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ) (NDSA) ఇచ్చిన నివేదికను చూసి బీఆర్‌ఎస్ నేతలు సిగ్గు పడాలంటూ మండిపడ్డారు. కాళేశ్వరంతో అద్భుతాలు సృష్టిస్తున్నామని చెప్పి లక్ష కోట్ల ప్రాజెక్ట్ కట్టారని.. ఎన్‌డీఎస్‌ఏ నివేదిక చూసి బీఆర్‌ఎస్ సిగ్గుపడాలన్నారు. ‘మీరే డిజైన్ చేశారు.. మీరే కట్టారు.. మీరుండగానే కూలిపోయింది’ అని తెలిపారు. మేడిగడ్డ, సుందిళ్ళ బ్యారేజీలు నిరుపయోగంగా ఉన్నా కూడా రికార్డు స్థాయిలో పంటలు పండాయని తెలిపారు.
అబద్ధాలు తప్పులపై బతకాలని బీఆర్‌ఎస్ అనుకుంటోందని.. అది కుదరదని స్పష్టం చేశారు. నిర్మాణం చేసిన వాళ్ళు.. చేయించిన వాళ్ళు రైతులకు ద్రోహం చేశారని ఆరోపించారు. ‘ఎన్‌డీఎస్‌ఏను రేవంత్ రెడ్డినో.. నేనో వేసింది కాదు. దేశంలో బెస్ట్ ఎక్స్‌పర్ట్స్ ఎన్‌డీఎస్‌ఏలో ఉన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడే ఎన్‌డీఎస్‌ఏ వచ్చింది ’ అని చెప్పుకొచ్చారు. రైతులకు బీఆర్‌ఎస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్‌డీఎస్‌ఏ రిపోర్టుపై అధ్యయం చేస్తామన్నారు. వచ్చే కేబినెట్‌లో ఎన్‌డీఎస్‌ఏపై చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు. ఎవడి అయ్య జాగీరు అని కట్టారని ప్రశ్నిస్తూ.. కాళేశ్వరం రైతుల కోసం కాదు జేబులు నింపుకునేందుకు కట్టారు అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
కాగా.. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు దెబ్బతిన్న నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై నివేదిక ఇవ్వాల్సిందిగా గతంలో ఎన్‌డీఎస్‌ఏను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దాదాపు పద్నాలుగు నెలల పాటు అధ్యయనం చేసి, ఎన్నో పరీక్షలు నిర్వహించిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్‌డీఎస్‌ఏ అందజేసింది.మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మూడు బ్యారేజీలు పెను ప్రమాదంలో ఉన్నాయని.. ఆ బారేజీలు నిరుపయోగమే అంటూ నివేదికలో తెలిపింది. మూడు బ్యారేజీలకు విస్తృత, పెను నష్టం జరిగిందని పేర్కొంది. ఈ నష్టం ఇక్కడితోనే ఆగదని, నీటి ఒత్తిడి ఎక్కువైతే మొత్తం పూర్తి బ్యారేజీలకే ప్రమాదమని పేర్కొంది. మూడు బ్యారేజీల్లోని ప్రతి ఒక్కటి ఈ ప్రమాదపుటంచులో ఉంటాయని నివేదికలో ఎన్‌డీఎస్‌ఏ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
CM Yogi Emotional Video: శుభం కుటుంబాన్ని చూసి సీఎం యోగి కంటతడి.. వీడియో వైరల్
Hyderabad High Alert: హై అలర్ట్.. హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత
Read Latest Telangana News And Telugu News
Updated Date - Apr 25 , 2025 | 04:04 PM