Drugs భారీగా డ్రగ్స్ పట్టివేత.. దాని విలువ ఎంతో తెలిస్తే మతిపోవడం ఖాయం
ABN, Publish Date - Feb 20 , 2025 | 07:43 PM
Drug Trafficking: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. వీటిని సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి దగ్గరి నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి.
హైదరాబాద్: హైదరాబాద్‌లో TGANB, సైబరాబాద్ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో అంతరాష్ట్ర మహిళ డ్రగ్ పెడ్లర్‌ను అరెస్ట్ చేశారు. బెంగళూర్‌కు చెందిన శతాబ్ది మన్నాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలి వద్ద రూ.6 లక్షల విలువ చేసే 60 గ్రాముల MDMA డ్రగ్స్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు ఆఫ్రికాకు చెందిన వారెన్ కొకరంగో పరారీ అయ్యాడు. ఇవాళ(గురువారం) మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
నిన్న (బుధవారం) TGNAB, సైబరాబాద్ మియాపూర్ పోలీసుల దాడులు జరిపారని చెప్పారు. బెంగళూర్ నుంచి వచ్చిన మహిళ శతాబ్ది మన్న (24) వద్ద 60 గ్రాముల MDMA డ్రగ్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. డ్రగ్ సరఫరా చేస్తున్న ప్రధాన నిందితుడు ఆఫ్రికాకు చెందిన వారెన్ కొకరంగో పరారీలో ఉన్నారని అన్నారు. బెంగుళూరులో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన శతాబ్ది మన్నా పట్టుబడ్డారని చెప్పారు. అక్కడే ఆఫ్రికాకు చెందిన విద్యార్థి వారెన్ కొకరంగోతో పరిచయం ఏర్పడిందని అన్నారు.
ఆర్థిక ఇబ్బందులతో నిందితురాలు డ్రగ్స్ సరఫరా చేస్తుందని వెల్లడించారు. బెంగుళూరు నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించామని అన్నారు. MDMA డ్రగ్ డెలివరీ చేసేందుకు హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌కు వచ్చినట్లు గుర్తించామని చెప్పారు. నిందితురాలు వద్ద రూ.6 లక్షల విలువ చేసే 60 గ్రాముల MDMA డ్రగ్స్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు. డ్రగ్ పెడ్లర్స్‌పై గట్టి నిఘా పెట్టామని మాదాపూర్ డీసీపీ వినీత్ హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Komatireddy: రాజలింగమూర్తి హత్యపై మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్
Minister: పాలమూరు బిడ్డలకు అండగా ఉంటాం..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Feb 20 , 2025 | 07:51 PM