Election Commission: స్థానిక ఎన్నికల నగరా.. స్పీడ్ పెంచిన ఎన్నికల సంఘం
ABN, Publish Date - Feb 08 , 2025 | 02:14 PM
Telangana State Election Commission: స్థానిక ఎన్నికలపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర స్టేట్ ఎలక్షన్ కమిషన్, కీలక ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాకు పది మంది చొప్పున మాస్టర్ ఆఫ్ ట్రైనర్స్ , స్టేట్ రిసోర్స్ పర్సన్‌లను ఎంపిక చేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనే అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం శిక్షణ ఇవ్వనుంది. ఇప్పటికే మాస్టర్ ఆఫ్ ట్రైనర్స్, స్టేట్ రిసోర్స్ పర్సన్‌లకు ఎంసీహెచ్ఆర్డీలో ఎన్నికల సంఘం ట్రైనింగ్ ఇచ్చింది.
జిల్లా కలెక్టర్లకు తెలంగాణ ఎలక్షన్ కమిషన్, కీలక ఆదేశాలు జారీ చేసింది. మండల, జిల్లా పరిషత్, పంచాయతీ రిటర్నింగ్ అధికారులను ఫిబ్రవరి 10వ తేదీ లోపు ఎంపిక పూర్తి చేయాలని ఆదేశించింది. పంచాయితీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల కోసం ఎంపిక చేసిన రిటర్నింగ్ అధికారులకు ఫిబ్రవరి 12లోపు శిక్షణ పూర్తి కావాలని తెలిపింది. పోలింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లకు ఈ నెల 15లోపు శిక్షణ పూర్తి చేయాలని సూచించింది. పోలింగ్ సిబ్బందికి మాస్టర్ ఆఫ్ ట్రైనర్స్‌తో శిక్షణ పూర్తి చేయాలని తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది.
Updated Date - Feb 08 , 2025 | 02:43 PM