Hyderabad Crime News: భర్తపై విరక్తితో భార్య చేసింది చూస్తే షాక్ అవ్వాల్సిందే
ABN, Publish Date - Apr 21 , 2025 | 01:32 PM
Hyderabad Crime News: హైదరాబాద్‌లో దారుణం జరిగింది. భర్తపై విరక్తి చెందిన ఓ భార్య అతడి పట్ల వ్యవహరించిన తీరు చూస్తే షాక్ అవకుండా ఉండలేరు.
హైదరాబాద్, ఏప్రిల్ 21: ఈ మధ్యకాలంలో భార్యల చేతుల్లో హతమవుతున్న భర్తల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఒకప్పుడు భార్యలను హింసించడం, మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని అడ్డుగా ఉందని భార్యను తొలగించడం వంటి దారుణలు ఎన్నో విన్నాం.. చూశాం. కానీ ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. భార్యలే భర్తలపై విరుచుకుపడుతున్నారు. తమ ప్రేమయణానికి అడ్డుగా వస్తున్నారని భర్తలను నిర్ధాక్షణ్యంగా వదలించుకుంటున్నారు. అంతవరకు సాఫీగా సాగుతున్న సంసారంలోకి మరొకరి ఎంట్రీతో కుదేలవుతున్న పరిస్థితి. వివాహేతర సంబంధాలు పెట్టుకుని, ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను కడతేర్చడానికి సిద్ధమైపోతున్నారు వివాహితలు. ఇటీవల కాలంలో ఇలాంటి దారుణాలను ఎన్నో చూశాం. ఓ చోట ప్రియుడి కోసం ఓ మహిళ భర్తను చంపి డ్రమ్ముల్లో వేసి సిమెంట్‌తో పూడ్చిపెడితే.. మరోచోట ప్రియుడితో కలిసి భర్తను చంపి కిరాతకానికి పాల్పడిందో వివాహిత. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళ గురించి తెలిస్తే మాత్రం వణికిపోవాల్సిందే. అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను ఆమె వదిలించుకున్న తీరు చూస్తే ఒళ్లుజలదరించకుండా ఉండదు మరి. ఈ ఘటన భాగ్యనగరం నడిబొడ్డున చోటు చేసుకుంది. ఇంతకీ అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను ఎంతో జాగ్రత్తగా చూసుకోవల్సిన భార్య ఏం చేసిందో ఇప్పుడు చూద్దాం.
అసలేం జరిగిందంటే..
కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో కట్టుకున్న భర్తను భార్య అతికిరాతంగా హత్య చేసింది. కేపీహెచ్‌బీలోని మిత్ర హిల్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో కవిత, ఆమె భర్త సాయిలు వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. అయితే భర్త సాయిలు 15 సంవత్సరాలు భయంకరమైన హెచ్‌ఐవీ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా 15 సంవత్సరాలుగా భార్యాభర్తలు విడివిడిగానే ఉంటున్నారు. అయితే కొంతకాలం క్రితమే పెద్దలు పంచాయతీ పెట్టి వీరిద్దరినీ కలిపారు. దీంతో పనిచేసుకునేందుకు స్వగ్రామమైన సంగారెడ్డి నుంచి హైదరాబాద్‌కు వచ్చారు దంపతులు. కూకట్‌పల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనికి కుదిరారు. అయితే నగరానికి వచ్చినప్పటి నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలుస్తోంది. తాగుబోతు అయిన సాయిలు తరుచూ భార్యను కొడుతూ చిత్ర హింసలకు గురుచేస్తూ ఉండేవాడు. దీంతో విరక్తి చెందిన భార్య కవిత.. భర్తను ఎలాగైన హత్య చేయాలని నిర్ణయించింది. ఇందు కోసం చెల్లెలు, ఆమె భర్త సాయాన్ని తీసుకుంది.
వారి పథకంలోనే భాగంగానే సాయిలును చంపేందుకు ముందుగా కవిత, ఆమె చెల్లెలు, చెల్లెలి భర్త కలిసి కరెంట్ షాక్ ఇచ్చారు. అప్పటికీ కూడా అతడు చనిపోకపోవడంతో ఉరివేసి చంపినట్లు తెలుస్తోంది. ఆపై మృతదేహాన్ని పూడ్చిపెట్టేందుకు ఆటోలో బయలుదేరారు. ఆటో డ్రైవర్‌కు అనుమానం రావడంతో వాళ్లను ప్రశ్నించగా.. అతడిని కూడా బెదిరించారు వీళ్లు. దీంతో ఆటో డ్రైవర్ వారిని వారు అనుకున్న ప్రదేశంలో విడిచి పెట్టి వెళ్లిపోయాడు. ఆ తరువాత సాయిలు మృతదేహాన్ని నివాసానికి సమీపంలో ముగ్గురు కలిసి పూడ్చిపెట్టారు. రెండు రోజుల తర్వాత కవిత వాళ్ళ స్వగ్రామమైన సంగారెడ్డి జిల్లా పాత లింగయ్య పల్లి విలేజ్ సర్పంచ్‌కు (కృష్ణయ్యకు) తన భర్త ఇసుక పనికి వెళ్లి తిరిగి రాలేదని సమాచారం ఇచ్చింది. అనుమానం వచ్చిన సర్పంచ్, స్థానికులు నిలదీయడంతో అసలు విషయాలు బయటపెట్టింది కవిత. సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఆటో డ్రైవర్ కూడా తాను చూసిస దానిపై పోలీసులు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కవిత, సాయిలు ఇరువురికీ వేరువేరుగా అక్రమ సంబంధాలు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. మరికాసేపట్లో పోలీసులు పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీసి.. పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఎమ్మార్వో సమక్షంలో పంచనామా నిర్వహించి పోస్టుమార్టం చేయనున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.
ఇవి కూడా చదవండి
Vamsi Bail: వంశీకి మళ్లీ నిరాశే
Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Apr 21 , 2025 | 02:25 PM