ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rowdy Sheeter Arrest: గోవా కాసినోలో హైదరాబాద్ రౌడీ షీటర్ హల్ చల్

ABN, Publish Date - May 30 , 2025 | 10:11 AM

Rowdy Sheeter Arrest: గోవా కాసినోలో హైదరాబాద్ రౌడీ షీటర్ హల్ చల్ సృష్టించాడు. కాసినో ఈవెంట్ వద్ద ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి చేసి పారిపోయి హైదరాబాద్ వస్తుండగా గోవా దబోలిమ్ ఎయిర్ పోర్టు వద్ద రౌడీ షీటర్‌ను గోవా పోలీసులు పట్టుకున్నారు.

Rowdy Sheeter Arrest

పనాజీ: గోవా (Goa)లో హైదరాబాద్ (Hyderabad) రౌడీ షీటర్ (Rowdy sheeter) అల్తాఫ్‌ (Altaf)ను పోలీసులు అరెస్ట్ (Arrest) చేశారు. గోవాలోని కాసినో (Goa casino) వద్ద హైదరాబాద్‌ మైలార్ దేవ్ పల్లికి చెందిన రౌడీ షీటర్ అల్తాఫ్ మద్యం మత్తులో ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి చేశాడు. కాసినో వద్ద వీరంగం సృష్టించటంతో సెక్యూరిటీ గార్డులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారిపై దాడి చేసి హైదరాబాద్ పారిపోయే ప్రయత్నం చేయగా.. గోవా ఎయిర్ పోర్టులో అల్తాఫ్‌ను గోవా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


గోవా కాసినోలో హైదరాబాద్ రౌడీ షీటర్ హల్ చల్ సృష్టించిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. గొడవలో కాసినో ఈవెంట్ సెక్యూరిటీ గార్డులపై దాడి చేసి పారిపోయి హైదరాబాద్ వస్తుండగా గోవా పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ మైలార్ దేవ్ పల్లికి చెందిన రౌడీ షీటర్ అల్తాఫ్ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి రెండు రోజుల క్రితం గోవా వెళ్లాడు. బుధవారం రాత్రి గోవా పానాజీ క్యాంపుల్‌ లోని కాసినోకు వెళ్లారు. అక్కడ సెక్యూరిటీ గార్డలుగా ఉన్న ధీరు శర్మ, సత్యం గోంకర్‌లతో గొడవపడ్డాడు. దురుసుగా ప్రవర్తించవద్దని సెక్యూరిటీ గార్డులు కోరినప్పటికీ, అల్తాఫ్ వెనక్కి తగ్గలేదు. వారిపై ఇనుప రాడ్‌తో దాడి చేసాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ధీరు శర్మ మరణించాడు. దీంతో రౌడీ షీటర్ అల్తాఫ్ హైదరాబాద్ పారిపోయేందుకు యత్నించడంతో గోవా పోలీసులు అరెస్టు చేశారు.

Also Read: కవితకు షోకాజ్ నోటీసులు..!


మరో సెక్యూరిటీ గార్డు సత్యం గోంకర్‌ గోవా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ కేసును ఎస్పీ రాహుల్ గుప్తా సారధ్యంలో దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పేకాట నిషేధం ఉండడంతో హైదరాబాద్‌కు చెందిన రౌడీ షీటర్‌లు గోవాలో పేకాట ఈవెంట్‌లను నిర్వహిస్తూ.. పేకాట రాయుళ్లను అక్కడికి విమానాల్లో తీసుకువెళ్లి కాసినో ఆడిస్తున్నట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలీసులకు చిక్కిన ఇద్దరు మావోయిస్టులు

సీఐఐ వార్షిక సదస్సుకు సీఎం చంద్రబాబు

For More AP News and Telugu News

Updated Date - May 30 , 2025 | 10:11 AM