ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Doctor Arrested in Drugs Case: అలా డ్రగ్స్‌కు అలవాటు పడ్డాను.. కొకెయిన్‌తో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన డాక్టర్ వెల్లడి

ABN, Publish Date - May 11 , 2025 | 04:20 PM

డ్రగ్స్ కొనుగోలు చేస్తూ దొరికిపోయిన డాక్టర్ నమ్రత పోలీసుల విచారణలో పలు విషయాలు వెల్లడించినట్టు తెలిసింది. తాను స్పెయిన్‌లో ఎమ్‌బీయే చేస్తుండగా డ్రగ్స్‌కు అలవాటు పడ్డట్టు తెలిపారు.

Hyderabad doctor cocaine case

హైదరాబాద్‌కు చెందిన డా. నమ్రత చిగురుపాటి భారీ మొత్తంలో కొకెయిన్‌ను డెలివరీ తీసుకుంటూ పోలీసులకు చిక్కడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. రూ.5 లక్షల పెట్టి కొనుగోలు చేసిన డ్రగ్స్‌ను కొరియర్ నుంచి డెలివరీ తీసుకుంటుండగా ఆమె పోలీసులకు దొరికిపోయారు. ఆమెకు డ్రగ్స్ సరఫరా చేసిన ఏజెంట్ బాలకృష్ణను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, కొకెయిన్‌ను సరఫరా చేసిన ప్రధాన నిందితుడు వన్ష్ థక్కర్ మాత్రం పరారీలో ఉన్నాడు.


డా. నమ్రతకు ఇద్దరు పిల్లులు. ఆమె భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. షేక్‌పేటలోని ఓ ఖరీదైన అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. 2014లో పీరమ్‌చెరువులోని ఓ కాలేజీలో ఆమె ఎంబీబీఎస్ చేశారు. ఆ తరువాత 2017లో కొచ్చిలో రేడియేషన్ ఆంకాలజీలో ఎమ్‌డీ పూర్తి చేశారు. 2021-2022లో స్పెయిన్‌లో ఎమ్‌బీఏ చేశారు. అక్కడ ఉండగానే ఆమెకు డ్రగ్స్ అలవాటయ్యాయి. ఇది వ్యసనంగా మారడంతో ఇండియాకు వచ్చాక కూడా తాను డ్రగ్స్ కొనసాగించానని ఆమె విచారణ సందర్భంగా చెప్పినట్టు సమాచారం. ఇక్కడ స్థానిక డీజేల ద్వారా ఆమె తొలుత డ్రగ్స్ కొనుగోలు చేసేవారు. ఆ తరువాత నమ్రత ఫ్రెండ్ బాయ్‌ఫ్రెండ్ ద్వారా ఆమెకు ముంబైకి చెందిన డ్రగ్స్ కింగ్‌పిన్ వన్ష్ థక్కర్ పరిచయమయ్యాడు. థక్కర్‌ వద్ద డ్రగ్స్ సరఫరా చేసే కొరియర్‌గా పనిచేసే వాడినని బాలకృష్ణ పోలీసుల విచారణలో తెలిపారు. తనకు కమీషన్ వచ్చేదని అన్నాడు.


‘‘మే 8న హైదరాబాద్‌లో నమ్రత తన కారులో ఉండగా బాలకృష్ణ ఆమెకు కొకెయిన్ ఇచ్చాడు. మరో రూ.10 వేలు అదనంగా తీసుకున్నాడు. ఈ క్రమంలోనే వారిని అరెస్టు చేశాము’’ అని రాయదుర్గం పోలీసులు తెలిపారు. ఈ డీల్‌కు సంబంధించిన కీలక ఆధారాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘‘ఏడాదిగా థక్కర్ నుంచి ఆమె కొకెయిన్ కొనుగోలు చేస్తోంది. నెలకోసారి డ్రగ్స్ కొంటారు. డ్రగ్స్ డెలివరీ ఎప్పుడు ఎక్కడ చేసేదీ థక్కర్ వాట్సాప్‌లో సూచనలు పంపిస్తాడు. ఈ మెసేజీలు వాతంతట అవే డిలీట్ అయిపోయేలా ఆమె డిస్సపియరింగ్ మెసేజీ ఆప్షన్‌ను ఆన్ చేసి పెట్టుకున్నారు’ అని పోలీసులు తెలిపారు. కొకెయిన్‌‌ను బాలకృష్ణ 57 చిన్న చిన్న ప్యాకెట్లలో సరఫరా చేసినట్టు వివరించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

డ్రగ్స్ కొనుగోలు.. హైదరాబాద్‌లో మహిళా డాక్టర్ అరెస్టు

Miss World 2025: శాంతి, ఐక్యత సందేశం ఇచ్చిన ఆరంభ వేడుకలు

ఎప్‌సెట్ ఫలితాలు విడుదల చేసి సీఎం రేవంత్ రెడ్డి

మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్చిన డిప్యూటీ సీఎం పవన్

For More TS News and Telugu News

Updated Date - May 11 , 2025 | 04:20 PM