ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Doctor Arrested For Buying Drugs: డ్రగ్స్ కొనుగోలు.. హైదరాబాద్‌లో మహిళా డాక్టర్ అరెస్టు

ABN, Publish Date - May 11 , 2025 | 03:23 PM

హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా డాక్టర్ రూ.5 లక్షల విలువైన డ్రగ్స్ కొనుగోలు చేస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. సదరు డాక్టర్ గతంలో ఒమెగా హాస్పిటల్స్‌కు సీఈఓగా చేశారు.

Hyderabad doctor cocaine case

ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా డాక్టర్ డ్రగ్స్ కొనుగోలు చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు చిక్కారు. రూ.5 లక్షల విలువైన మాదకద్రవ్యాలను ఓ కొరియర్ నుంచి తీసుకుంటుండగా డా.నమ్రతా చిగురుపాటిని పోలీసులు అరెస్టు చేశారు. గతంలో ఆమె ఒమెగా హాస్పిటల్స్ సీఈఓగా పనిచేశారు. ఆరు నెలల క్రితం రాజీనామా చేశారు. ముంబైకి చెందిన సప్లయ్యర్ వన్ష్ ధక్కర్ నుంచి కొరియర్ ద్వారా కొకెయిన్ కొనుగోలు చేస్తున్న సందర్భంలో దొరికిపోయారు. డా. నమ్రతతో పాటు ఆమెకు డ్రగ్స్ ఇచ్చిన ధక్కర్ సహాయకుడు బాలకృష్ణను కూడా పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.


వాట్సాప్ ద్వారా డా. నమ్రత ధక్కర్‌ను సంప్రదించి రూ.5 లక్షల డ్రగ్స్‌కు ఆర్డర్ పెట్టారని పోలీసులు తెలిపారు. ఈ డబ్బును ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేసినట్టు చెప్పారు. ‘‘వన్ష్ ధక్కర్‌తో నమ్రతకు ముందే పరిచయం ఉంది. ఆ తరువాత బాలకృష్ణ అనే వ్యక్తి ఆమెకు రాయదుర్గం వద్ద డ్రగ్స్ ఇచ్చేందుకు వచ్చాడు. ఇద్దరినీ ట్రాక్ చేసి పోలీసులు పట్టుకున్నారు. రూ.10 వేల నగదు, 53 గ్రాముల కొకెయిన్, రెండు సెల్ ఫోన్లు వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నాము’’ అని సీనియర్ పోలీసు ఆఫీసర్ తెలిపారు.


నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన వారిని జుడీషియల్ కస్టడీకి పంపినట్టు తెలిపారు. విచారణ సందర్భంగా తాను ఇప్పటివరకూ రూ.70 లక్షలను డ్రగ్స్‌పై ఖర్చు పెట్టినట్టు నమ్రత పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. దీంతో, ఈ ఉదంతం ప్రస్తుతం నగరంలో సంచలనంగా మారింది.

ఈ వార్తలు కూడా చదవండి..

Miss World 2025: శాంతి, ఐక్యత సందేశం ఇచ్చిన ఆరంభ వేడుకలు

ఎప్‌సెట్ ఫలితాలు విడుదల చేసి సీఎం రేవంత్ రెడ్డి

మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్చిన డిప్యూటీ సీఎం పవన్

For More TS News and Telugu News

Updated Date - May 11 , 2025 | 03:28 PM