ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Doctor death: విహారయాత్రలో విషాదం.. హైదరాబాద్ డాక్టర్ మృతి

ABN, Publish Date - Feb 20 , 2025 | 12:42 PM

Doctor death: హంపిలో హైదరాబాద్ డాక్టర్ మృతి తీవ్ర కలకలం రేపుతోంది. సరదా కోసం తుంగభద్ర నదిలో ఈతకు దిగిన డాక్టర్ అనన్యరావు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు.

Hyderabad Doctor Ananya rao Death

హైదరాబాద్, ఫిబ్రవరి 20: విహార యాత్ర విషాదంగా మారింది. హైదరాబాద్‌కు (Hyderabad) చెందిన ఓ లేడీ డాక్టర్ (Lady Doctor)స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లింది. అయితే విహార యాత్రలో సరదాగా ఈతకు దిగిన ఆమె తిరిగి బయటకు రాలేదు. ఈతే ఆమె పాలిట మృత్యువుగా మారింది. కర్ణాటక రాష్ట్రంలోని హంపిలో ఈ ఘటన చోటు చేసుకుంది. హంపి వద్ద హైదరాబాద్‌కు చెందిన లేడీ డాక్టర్ మృతి తీవ్ర కలకలం రేపుతోంది. విహారయాత్రకు వెళ్లిన అనన్యరావు ఈత కోసం తుంగభద్ర నదిలో దూకారు. అయితే కాసేపటికే నీటి ప్రవాహంలో ఆమె కొట్టుకుపోయారు.


రెండు రోజుల క్రితం స్నేహితులతో కలిసి ట్రిప్‌కు వెళ్లారు డాక్టర్ అనన్య రావు. హంపిలోని ఓ రిసార్ట్‌లో స్నేహితులతో కలిసి స్టే చేశారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత తుంగభద్ర నదిని చూసేందుకు వెళ్లిన సమయంలో ఆ నదిలో ఈతకొట్టాలని వారు భావించారు. ఈ క్రమంలో డాక్టర్ అనన్య రావు 25 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకారు. కాసేపు స్విమ్మింగ్ చేశారు. అయితే కొద్దిసేపటికే మరోవైపు నుంచి అలలు రావడంతో నీటి ప్రవాహంలో డాక్టర్ కొట్టుకుపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన స్నేహితులు ఆమెను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తుంగభద్రలో అనన్యరావు దూకుతున్న దృశ్యాలను స్నేహితులు వీడియో తీశారు.

వంశీకి ఏపీ హైకోర్టులో బిగ్ షాక్


రెండు నిమిషాల పాటు స్విమ్మింగ్ చేయగా.. ఆ సమయంలో వ్యతిరేక దిశలో అలలు రావడంతోనే లేడీ డాక్టర్ కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉన్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు స్నేహితులు. వెంటనే వారు అక్కడకు చేరుకుని దాదాపు మూడు గంటల పాటు తుంగభద్ర నదిలో గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు అనన్యరావు మృతదేహాన్ని బయటకు తీశారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ డాక్టర్ కుమార్తె అనన్యరావు. ఆమె కూడా డాక్టర్ చదవు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో స్నేహితులతో కలిసి విహారయత్రకు వెళ్లిన అనన్యరావు ప్రాణాలు కోల్పోయింది. కుమార్తె మృతి సమాచారం తెలుసుకున్న అనన్యరావు తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. సరదాగా స్నేహితులతో కలిసి ట్రిప్‌కు వెళ్లిన తమ కుమార్తె విగతజీవిగా రావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

వైసీపీపై షాకింగ్ కామెంట్స్ చేసిన షర్మిల..

పీఎం కిసాన్ నిధులు పడేది ఆ రోజే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 20 , 2025 | 12:44 PM