Hyderabad Woman: మైనర్ బాలుడిపై మహిళ లైంగిక దాడి
ABN, Publish Date - May 05 , 2025 | 12:08 PM
Hyderabad Woman: ఆ పని మనిషి మార్చి నుంచి ఏప్రిల్ వరకు పలు మార్లు మైనర్ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడింది. పని మనిషి సదరు బాలుడ్ని ముద్దు పెట్టుకుంటుండగా బాలుడి తల్లి దగ్గర పని చేసే మేనేజర్ చూశాడు. ఈ విషయాన్ని బాలుడి తల్లికి చెప్పాడు.
మైనర్ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో ఓ మహిళ జైలు పాలైంది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు, మైనర్ బాలుడి తల్లి తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని సర్వెంట్ క్వాటర్స్‌లో 28 ఏళ్ల మహిళ పని మనిషిగా పని చేస్తోంది. అక్కడి ఓ ఇంట్లో మైనర్ బాలుడు తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఆ పని మనిషి మైనర్ బాలుడికి మాయమాటలు చెప్పి వశపరుచుకుంది. అతడ్ని లైంగికంగా వేధించేది. ఈ విషయం బయటకు చెప్పొద్దంటూ బెదిరించేది.
మార్చి నుంచి ఏప్రిల్ వరకు పలు మార్లు అతడిపై లైంగిక దాడికి పాల్పడింది. పని మనిషి సదరు బాలుడ్ని ముద్దు పెట్టుకుంటుండగా బాలుడి తల్లి దగ్గర పని చేసే మేనేజర్ చూశాడు. ఈ విషయాన్ని తల్లికి చెప్పాడు. ఆమె ఆ పని మనిషిని నిలదీసింది. అతడు తనకు తమ్ముడి లాంటి వాడని, ప్రేమతో ముద్దు పెట్టుకున్నానని పని మనిషి చెప్పింది. ఈ నేపథ్యంలోనే బాలుడి తల్లి పని మనిషికి వార్నింగ్ ఇచ్చింది. తన కుమారుడికి దూరంగా ఉండమని అంది. మే 1వ తేదీన బాలుడు తనపై జరుగుతున్న లైంగిక దాడి గురించి తల్లిదండ్రులకు చెప్పాడు.
ఈ నేపథ్యంలోనే బాలుడి తల్లి అదే రోజున జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. పని మనిషిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సెక్షన్ 351(2), సెక్షన్9(1), పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితురాలిని అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరపరిచారు. కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. పోలీసులు బాలుడ్ని భరోసా సెంటర్‌కు కౌన్సిలింగ్ కోసం పంపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటనపై బాలుడి తల్లి మాట్లాడుతూ.. ‘ తను నా కొడుకును ముద్దు మాత్రమే పెట్టుకుందని అనుకున్నాను. నా కొడుకుతో తప్పుగా ప్రవర్తించవద్దని ఆమెకు వార్నింగ్ ఇచ్చాను. మే 1వ తేదీన నేను నా భర్త ఏం జరిగిందని గట్టిగా అడిగాము. అప్పుడు జరిగిన సంగతి చెప్పాడు’ అని అంది.
ఇవి కూడా చదవండి
Terrorists Hideout: తప్పిన పెను ప్రమాదం.. ఉగ్ర స్థావరంలో భారీగా బయటపడ్డ ఐఈడీలు
Jammu and kashmir: మరో కుట్రకు తెరలేపిన ఉగ్రవాదులు.. ఈ సారి జైళ్లు టార్గెట్‌గా..
Updated Date - May 05 , 2025 | 12:16 PM