MLA: వేలం పేరుతో ప్రజలను మోసం చేస్తున్న హౌసింగ్ బోర్డు
ABN, Publish Date - Jan 24 , 2025 | 10:49 AM
ప్లాట్ల వేలం పేరుతో ప్రజలను మోసం చేయొద్దని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హౌసింగ్‌బోర్డు అధికారులకు సూచించారు. హౌసింగ్ బోర్డు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, మున్సిపల్ చట్టాలు, మాస్టర్ ప్లాన్‌ను పరిగణలోకి తీసుకోకుండా ప్లాట్లను అమ్ముకుని సొమ్ముచేసుకోవడమే ధ్యేయంగా పనిచేయడం సిగ్టుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- రోడ్ల విస్తరణలో ప్లాట్లు పోయే ప్రమాదం ఉంది: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
హైదరాబాద్: ప్లాట్ల వేలం పేరుతో ప్రజలను మోసం చేయొద్దని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishna Rao) హౌసింగ్‌బోర్డు అధికారులకు సూచించారు. హౌసింగ్ బోర్డు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, మున్సిపల్ చట్టాలు, మాస్టర్ ప్లాన్‌ను పరిగణలోకి తీసుకోకుండా ప్లాట్లను అమ్ముకుని సొమ్ముచేసుకోవడమే ధ్యేయంగా పనిచేయడం సిగ్టుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా హైదరాబాద్ మాస్టార్ ప్లాన్ ప్రకారం కేపీహెచ్‌బీ కాలనీ 7వ ఫేజ్ నుంచి గోపాల్‌నగర్ వైపు 200 అడుగుల నిర్ణయించిన రోడ్డుకు పక్కన ఉన్న 146గజాలు, 78(50)గజాల రెండు ప్లాట్లకు, 80 పీట్ల రోడ్లను చూపుతూ అమ్మకానికి పెట్టడంవల్ల మోసం చేస్తున్నారని విమర్శించారు.
ఈ వార్తను కూడా చదవండి: Website: వాటర్‌బోర్డు వెబ్‌సైట్ హ్యాకింగ్
ఈ రెండు ప్లాట్లు కొనుగో లు చేసే వారు రేపటి రోజున ప్లాట్లు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. అధికారులు మాత్రం రోడ్డులో ప్లాట్లు పోతే జీహెచ్‌ఎంసీ(GHMC) నష్టపరిహారం కింద టీడీఆర్ ఇస్తారని చెబుతున్నారని అలా చూసిన సరే ప్లాటు కొన్న ధరకు టీడీఆర్ ధరతో పోలిస్తే పావువంతు కూడా రాదన్నారు. ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా హౌసింగ్ బోర్డు భూములను వేలం వేయ్యడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజానికి వేలానికి పెట్టిన 24ప్లాట్లలో 1,2 మినహా ఏ ఒక్క ప్లాటు కూడా వాస్తు ప్రకారం చూసిన చివరకు ఇళ్ల నిర్మాణం కోసం జీహెచ్‌ఓఎంసీ అనుమతుల ప్రకారం చూసినా ఏకటి కూడా ఉపయోగపడదన్నారు.
కూకట్‌పల్లి(Kukatpally) ప్రాంతంలోని ప్రజలు హౌసింగ్ బోర్డు భూములను కొనుగోలు చేసేముందు అన్ని రకాలుగా పరిశీలించి ముందుకు సాగాలని సూచించారు. ఒకసారి కొనుగోలు చేసిన తర్వాత హౌసింగ్‌బోర్డుకానీ, ఇతర అధికారులుకానీ బాధ్యత వహించరని గుర్తించాలన్నారు. నిజంగా నివాస యోగ్యమైన స్థలం ఉంటే కొనుగోలు చేయ్యవచ్చని, శుక్రవారం జరిగే వేలం ప్రక్రియలో పాల్గొనే ప్రజలు తప్పని సరిగా ముందస్తుగా అన్ని పరిశీలించుకుని కొనుగోలు చేయాలని తెలిపారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ
కేపీహెచ్‌బీ డివిజన్‌కు చెందిన సిహెచ్ సతీష్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఆస్పత్రి బిల్లుల కోసం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో అతనికి మంజూరైన రూ.2లక్షలు కూకట్‌పల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే మాధరం కృష్ణారావు చేతుల మీదుగా అందజేశారు.
ఈవార్తను కూడా చదవండి: కిడ్నీ మార్పిడి జరిగిందెక్కడ?
ఈవార్తను కూడా చదవండి: నేనే చంపాను.. మీ వద్ద సాక్ష్యాలున్నాయా?
ఈవార్తను కూడా చదవండి: భర్త దొంగ అని తెలిసి షాక్.. బిడ్డల్ని చంపి.. తల్లి ఉరి
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: దావోస్ ధమాకా!
Read Latest Telangana News and National News
Updated Date - Jan 24 , 2025 | 10:49 AM