Manchu Mohan Babu: మోహన్‌బాబు దాడి కేసుపై స్థాయీ నివేదిక ఇవ్వండి: హైకోర్టు
ABN, Publish Date - Jun 13 , 2025 | 03:41 AM
జర్నలిస్టుపై సినీనటుడు మంచు మోహన్‌బాబు దాడి చేశారం టూ పహడీషరీఫ్ పోలీ్‌సస్టేషన్‌లో నమోదైన క్రిమినల్ కేసు దర్యాప్తు ఏదశలో ఉందో తెలుపుతూ స్థాయీ నివేదిక ఇవ్వాలని హైకోర్టు పోలీసులను ఆదే శించింది.
హైదరాబాద్, జూన్12 (ఆంధ్రజ్యోతి): జర్నలిస్టుపై సినీనటుడు మంచు మోహన్‌బాబు దాడి చేశారం టూ పహడీషరీఫ్ పోలీ్‌సస్టేషన్‌లో నమోదైన క్రిమినల్ కేసు దర్యాప్తు ఏదశలో ఉందో తెలుపుతూ స్థాయీ నివేదిక ఇవ్వాలని హైకోర్టు పోలీసులను ఆదే శించింది. మోహన్‌బాబు ఇంట్లో తలెత్తిన సమస్యపై కవరేజ్‌కి వెళ్లిన జర్నలిస్టు రంజిత్‌కుమార్‌పై దాడి చే శారంటూ కేసు నమోదైంది.
దీన్ని కొట్టివేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం జస్టిస్ కే లక్ష్మణ్ ధర్మాసనం విచారించింది. రంజిత్‌కు ఇంకా నోటీసులు అందలేదని ఆయన తరఫు న్యాయవాదులు తెలిపా రు. నోటీసు అందజేయాలని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల24కు వాయిదావేసింది.
Updated Date - Jun 13 , 2025 | 03:41 AM