ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Yadagirigutta Temple: యాదగిరిగుట్టలో భక్తుల సందడి

ABN, Publish Date - Apr 21 , 2025 | 04:05 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వారాంతపు సెలవు దినం కావడంతో ఇష్టదైవాలను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.

  • దర్శించుకున్న 45వేల మంది భక్తులు.. రామయ్యను దర్శించుకున్న సీపీ ఆనంద్‌

యాదగిరిగుట్ట రూరల్‌, భద్రాచలం, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వారాంతపు సెలవు దినం కావడంతో ఇష్టదైవాలను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులతో కొండపైన ఆలయ తిరువీధులు, స్వామివారి ఉభయ దర్శనాల క్యూలైన్లు నిండిపోయాయి. ధర్మదర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు.


సుమారు 45వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. మరోవైపు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామిని హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు డీజీ సీవీ ఆనంద్‌కు ఆశీర్వచనం చేశారు.

Updated Date - Apr 21 , 2025 | 04:05 AM