Yennam srinivas Reddy: హరీశ్, కేసీఆర్ కమిషన్ ఎదుట హాజరైతేనే వాస్తవాలు వెలుగులోకి: యెన్నం
ABN, Publish Date - Jun 07 , 2025 | 04:53 AM
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సర్కారు వేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట హరీశ్‌రావు, కేసీఆర్ విచారణకు హాజరైతేనే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సర్కారు వేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట హరీశ్‌రావు, కేసీఆర్ విచారణకు హాజరైతేనే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతి, పర్యవేక్షణ, డిజైన్, నాణ్యతా లోపాలపై కాగ్ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రాజెక్టు వ్యయం రూ.82 వేల కోట్ల నుంచి లక్షా 20 వేల కోట్లు పెరిగిన విషయంపై నాటి ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ తనకు సంబంధం లేదనడం దురదృష్టకరమన్నారు. విచారణ కమిషన్ ఎదుట ఈటల వివరణ విశ్లేషిస్తే.. మొత్తం అప్పటి సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని స్పష్టమవుతోందన్నారు. 2018-2023 వరకు బీఆర్‌ఎ్‌సకు వచ్చిన రూ.1,400 కోట్ల ఎన్నికల బాండ్లు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమేనని ఆరోపించారు. బీఆర్‌ఎస్ రాజకీయ కుట్రతోనే ధన్వాడ ఘటన జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత సంపత్ కుమార్ అన్నారు.
Updated Date - Jun 07 , 2025 | 04:53 AM