ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ponguleti: పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు:పొంగులేటి

ABN, Publish Date - Jun 07 , 2025 | 04:09 AM

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద పట్టణాల్లోనూ ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ఆయన సమీక్షించారు.

హైదరాబాద్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద పట్టణాల్లోనూ ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పట్టణాల్లోని మురికివాడల్లో జీవనం సాగిస్తున్న పేదలకు హైదరాబాద్‌కు దూరంగా ఇళ్లను నిర్మించి ఇస్తే తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందనే భావనతో ఇళ్లను తీసుకునేందుకు ఆసక్తి చూపడంలేదన్నారు.


ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని.. హైదరాబాద్‌లోని మురికివాడల్లో ఉంటున్న పేదలకు, వారున్న చోటే గ్రౌండ్‌ ఫ్లస్‌ 3 అంతస్తుల విధానంలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి వారికి ఇవ్వాలనే నిర్ణయించిన్నట్టు వెల్లడించారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో తొలివిడతలో 16 మురికివాడలను గుర్తించామని తెలిపారు. సీఎం రేవంత్‌ సూచనల మేరకు గిరిజనులకు భద్రాచలం, ఉట్నూరు, ఏటూరునాగారం, మన్ననూరు ఐటీడీఏ పరిఽధిలోని చెంచు, కోలం, తోటి, కొండరెడ్డి జాతులకు 13,266 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామన్నారు. 16 ఎస్టీ నియోజకవ ర్గాలకు ఇప్పటికే 8,750 ఇళ్లను మంజూరు చేశామని.. ఈ రెండింటితో కలిపి గిరిజనులకు ఇప్పటివరకు 22,016 ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు.

Updated Date - Jun 07 , 2025 | 04:09 AM