ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Double Bedroom Flats: పోచారంలో ఫ్లాట్ల వేలం.. 36 కోట్ల ఆదాయం

ABN, Publish Date - Aug 02 , 2025 | 04:09 AM

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పోచారం మునిసిపాలిటీలోని రాజీవ్‌ స్వగృహ సద్భావన టౌన్‌షి్‌పలో శుక్రవారం జరిగిన డబుల్‌ బెడ్‌రూం ఫ్లాట్ల వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.36 కోట్ల ఆదాయం వచ్చింది.

  • నేడూ కొనసాగనున్న వేలం పాట

ఘట్‌కేసర్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పోచారం మునిసిపాలిటీలోని రాజీవ్‌ స్వగృహ సద్భావన టౌన్‌షి్‌పలో శుక్రవారం జరిగిన డబుల్‌ బెడ్‌రూం ఫ్లాట్ల వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.36 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం 190 ఫ్లాట్లను వేలం వేయగా, వాటికి దరఖాస్తు చేసుకున్న వారికి ఆ ఫ్లాట్లను కేటాయించారు. చాలా ఫ్లాట్లకు ఒక్కొక్క దరఖాస్తు మాత్రమే వచ్చింది. ఈ వేలం పాటను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీపీ గౌతమ్‌ తెలిపారు. మిగిలిన డబుల్‌ బెడ్‌రూం ఫ్లాట్ల్లకు లాటరీ పద్ధతిలో కేటాయింపులు చేస్తామని ఆయన వివరించారు. శనివారం సింగిల్‌ బెడ్‌రూం ఫ్లాట్లకు వేలం పాట నిర్వహిస్తామని పేర్కొన్నారు.

Updated Date - Aug 02 , 2025 | 04:09 AM