Hyderabad: రాజ్‌భవన్‌లో ‘ఎట్‌హోం’
ABN, Publish Date - Jan 27 , 2025 | 04:14 AM
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో నిర్వహించిన ‘ఎట్‌హోం’ కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనీటి విందు ఇచ్చారు.
హాజరైన సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు
పాల్గొన్న బీజేపీ నేతలు.. దూరంగా బీఆర్‌ఎస్
హైదరాబాద్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో నిర్వహించిన ‘ఎట్‌హోం’ కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనీటి విందు ఇచ్చారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్, కన్హా శాంతివనం వ్యవస్థాపకులు కమలేశ్ డి పటేల్ తదితరులు హాజరయ్యారు. వీరితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. గవర్నర్ ఇచ్చిన తేనీటి విందుకు బీఆర్‌ఎస్ పార్టీ దూరంగా ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రాజ్‌భవన్‌కు చేరుకున్న కొద్దిసేపటికే గవర్నర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఇటీవల ప్రకటించిన గవర్నర్ ప్రతిభ పురస్కారాలను ప్రదానం చేశారు. 4 సంక్షేమ పథకాల అమలు నేపథ్యంలో ఆయా జిల్లాలకు వెళ్లడంతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ తదితరులు ఎట్‌హోంకు రాలేకపోయారు. కార్యక్రమానికి హాజరైన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సరదాగా మాట్లాడారు. అనంతరం.. ఎట్ హోం కార్యక్రమానికి బీఆర్‌ఎస్ హాజరు కాలేదని మంత్రి పొన్నంతో విలేకరులు చెప్పగా.. ఆయన స్పందిస్తూ రాజ్యాంగంపై బీఆర్‌ఎ్‌సకు గౌరవం లేదని విమర్శించారు. ఎట్‌హోంలో నటి సంయుక్తమీనన్ పాల్గొనగా.. పలువురు నేతలు ఆమెతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు.
గవర్నర్.. సీఎం భేటీ..
తేనీటి విందు ముగిసిన తరువాత గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ భేటీ అయ్యారు. దాదాపు అరగంటపాటు పలు అంశాలపై ముచ్చటించారు. దావోస్ ఆర్థిక సదస్సులో తెలంగాణకు వచ్చిన రూ.1,78,950 కోట్ల పెట్టుబడుల గురించి గవర్నర్‌కు సీఎం వివరించినట్టు సమాచారం. 4 పథకాలతోపాటు స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్‌పై చర్చించారు. ఎస్సీ వర్గీకరణ అంశం కూడా వారి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. మంత్రివర్గ విస్తరణపైనా మాట్లాడుకున్నట్టు సమాచారం.
ప్రతిభా పురస్కారాలు అందుకున్న వారు
జీవిత సాఫల్య పురస్కారం
డాక్టర్ జి.చంద్రశేఖర్‌రెడ్డి ఐఎ్‌ఫఎస్( పర్యావరణ పరిరక్షణ)
వ్యక్తిగత విభాగం
దుశర్ల సత్యనారాయణ, అరికపూడి రఘు, జీవన్‌జీ దీప్తి, పీబీ కృష్ణ భారతి, పాండు రంగారావు
సంస్థాగత విభాగం
ధ్రువాంశ్ ఆర్గనైజేషన్, ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్, ఆదిత్య మెహతా ఫౌండేషన్, సంస్కృతి ఫౌండేషన్
ఈ వార్తలు కూడా చదవండి
Vijayasai Reddy: విజయసాయిరెడ్డి భవిష్యత్తు ప్లాన్ ఇదేనా..!
Republic Day.. ఏపీలో రిపబ్లిక్ వేడుకలు.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..
Republic Day.. బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు: వైఎస్ షర్మిల
Updated Date - Jan 27 , 2025 | 04:14 AM