Metro Rail: మెట్రో రైల్ ప్రయాణికులకు శుభవార్త.. భారీగా తగ్గిన ఛార్జీలు..
ABN, Publish Date - May 23 , 2025 | 04:01 PM
Metro Rail: సాధారణ బస్ ఛార్జీలతో పోల్చుకుంటే మెట్రో ఛార్జీలు కొంచెం అధికంగా ఉంటాయి. ఇదే ప్రయాణికులకు కొంచెం ఇబ్బందిగా ఉండేది. అయితే, ఛార్జీల విషయంలో కూడా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకూడదని మెట్రో యజమాన్యం నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ నగరం అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ట్రాఫిక్. ట్రాఫిక్ హెవీగా ఉంటే ఒక కిలోమీటర్ ప్రయాణానికి గంటల సమయం పడుతుంది. హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాల నుంచి ప్రజల్ని రక్షించడానికి మెట్రో ఓ వరంగా మారింది. మెట్రో పుణ్యమా అని జనం ట్రాఫిక్ చింత లేకుండా.. ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలో ప్రయాణిస్తున్నారు.
అయితే, సాధారణ బస్ ఛార్జీలతో పోల్చుకుంటే మెట్రో ఛార్జీలు కొంచెం అధికంగా ఉంటాయి. ఇదే ప్రయాణికులకు కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఛార్జీల విషయంలో కూడా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకూడదని మెట్రో యజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో ఛార్జీలను తగ్గించింది. తగ్గిన ఛార్జీలు శనివారం నుంచి అమలు కానున్నాయి.
తగ్గిన ఛార్జీల వివరాలు
తగ్గిన మెట్రో ఛార్జీల ప్రకారం.. కనీస ధర 11 రూపాయలుగా కాగా.. గరిష్ట ధర 69 రూపాయలుగా ఉంది. రెండు కిలోమీటర్ల వరకు మెట్రో ఛార్జీని 12 రూపాయల నుంచి 11 రూపాయలకు తగ్గించారు. 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు ఛార్జీని 18 రూపాయల నుంచి 17 రూపాయలకి.. 4 నుంచి 6 కిలో మీటర్ల వరకు ఛార్జీని 30 నుంచి 28 రూపాయలకు..
6 నుంచి 9 కిలోమీటర్ల వరకు ఛార్జీని 40 నుంచి 37 రూపాయలకు వరకు తగ్గించారు. 9 నుంచి 12 కిలోమీటర్ల వరకు ఛార్జీ 50 నుంచి 47 రూపాయలకు.. 12 నుంచి 15 కిలోమీటర్ల వరకు ఛార్జీ 55 నుంచి 51 రూపాయలకు.. 15 నుంచి 18 కిలోమీటర్ల ఛార్జీ 60 నుంచి 56 రూపాయలకు.. 18 నుంచి 21 కిలోమీటర్ల ఛార్జీ 66 నుంచి 61 రూపాయలకు..
21 నుంచి 24 కిలోమీటర్ల ఛార్జీని 70 నుంచి 65 రూపాయలకు.. 24 కిలోమీటర్లకు పైగా ఉండే ప్రయాణ ఛార్జీ 75 రూపాయల నుంచి 69 రూపాయలకు తగ్గించారు. తగ్గిన ఛార్జీలతో మెట్రో ప్రయాణికులకు ఎంతో మేలు జరగనుంది. రాబోయేది వర్షాకాలం కాబట్టి.. జనం మెట్రో ప్రయాణానికి మొగ్గుచూపే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
Mysore Pak: భారత్, పాకిస్తాన్ యుద్ధం.. మైసూర్ పాక్‌లో పాక్ ఉందని..
Cheating Case: పోలీసుల కస్టడీకి శ్రవణ్‌రావు
Updated Date - May 23 , 2025 | 04:01 PM