ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: లంగర్‌హౌస్‌ ఘటన.. ఏఈ, ఈఎఫ్ఏ అవుట్‌

ABN, Publish Date - Mar 06 , 2025 | 08:52 AM

లంగర్‌హౌస్‌ హుడా చెరువు ప్రమాద ఘటనపై జీహెచ్‌ఎంసీ చర్యలకు శ్రీకారం చుట్టింది. అసిస్టెంట్‌ ఎంటమాలజిస్టు (ఏఈ) రమేష్‌, ఎంటమాలజీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ శివలను విధుల నుంచి తొలగిస్తూ కమిషనర్‌ ఇలంబరిది నిర్ణయం తీసుకున్నారు.

- ఎస్‌ఈకి షోకాజ్‌ నోటీస్‌..

హైదరాబాద్‌ సిటీ: లంగర్‌హౌస్‌(Langarhouse) హుడా చెరువు ప్రమాద ఘటనపై జీహెచ్‌ఎంసీ(GHMC) చర్యలకు శ్రీకారం చుట్టింది. అసిస్టెంట్‌ ఎంటమాలజి్‌స్ట(ఏఈ) రమేష్‌, ఎంటమాలజీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ శివలను విధుల నుంచి తొలగిస్తూ కమిషనర్‌ ఇలంబరిది(Commissioner Ilambaridi) నిర్ణయం తీసుకున్నారు. దుర్ఘటనపై వివరణ ఇవ్వాలని సీనియర్‌ ఎంటమాలజిస్ట్‌ రజినికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది.

ఈ వార్తను కూడా చదవండి: Gandhi Hospital: అయినా అదే తీరు.. మంత్రి మందలించినా మారని గాంధీ ఆస్పత్రి వైద్యులు


నిర్ణీత గడువులోగా ఆమె వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ వివరణ సహేతుకంగా లేని పక్షంలో ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని ఓ అధికారి తెలిపారు. హుడా కాలనీ చెరువులో గుర్రపు డెక్క తొలగిస్తూ గత నెల 26వ తేదీన తండ్రీకొడుకులు కరీమ్‌, సాహిల్‌ నీట మునిగి మృతి చెందారు. యంత్రాలతో చేయాల్సిన పనులను కార్మికులతో చేయించడం, కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వారు మరణించి ఆ కుటుంబం రోడ్డున పడింది.


ఘటనను సీరియ్‌సగా పరిగణిస్తున్నట్టు పేర్కొన్న ఉన్నతాధికారులు ఏఈ, ఈఎఫ్‌ఏ(AE, EFA)లను తొలగించారు. గ్రేటర్‌లోని చెరువుల్లో గుర్రపు డెక్కను యంత్రాల ద్వారా తొలగించాలి. చెరువు లోపలి నుంచి యంత్రాలు ఒడ్డు వరకు తీసుకువచ్చే వ్యర్థాలను ఎంటమాలజీ సిబ్బంది బయట వేస్తుంటారు. ఈ పనులు కూడా కార్మికులతో చేయించవద్దని గతంలో ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.


ఈ వార్తను కూడా చదవండి: BJP victory: బీజేపీదే గెలుపు

ఈ వార్తను కూడా చదవండి: ఎస్సీ వర్గీకరణ.. బీసీ రిజర్వేషన్ల పెంపు!

ఈ వార్తను కూడా చదవండి: సీతారామ’తో ఖమ్మం జిల్లా సస్యశ్యామలం

ఈ వార్తను కూడా చదవండి: Heatwave: భానుడి భగభగలు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 06 , 2025 | 08:56 AM