ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

TG High Court: గాలి జనార్దన్‌రెడ్డి పిటిషన్‌లపై నేడు తీర్పు

ABN, Publish Date - Jun 11 , 2025 | 04:54 AM

ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) కేసులో దోషిగా తేలిన మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి సహా ఇతరులు దాఖలు చేసిన పిటిషన్‌లపై బుధవారం టీ-హైకోర్టు తీర్పు వెలువరించనుంది.

హైదరాబాద్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) కేసులో దోషిగా తేలిన మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి సహా ఇతరులు దాఖలు చేసిన పిటిషన్‌లపై బుధవారం టీ-హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ముద్దాయిలు గాలి జనార్దన్‌రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, వీడీ రాజగోపాల్‌, అలీఖాన్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌లతోపాటు గాలి జనార్దన్‌రెడ్డి విడిగా దాఖలు చేసిన జైలుశిక్ష సస్పెన్షన్‌ పిటిషన్లపై తీర్పు వెలువడనుంది. జైలుశిక్ష సస్పెన్షన్‌ పిటిషన్‌పై మంగళవారం వాదనలు కొనసాగాయు. జనార్దన్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాదులు నళిన్‌కుమార్‌, నాగముత్తు వాదించారు. పిటిషనర్‌ ఇప్పటికే 50శాతానికి పైగా అంటే మూడున్నరేళ్లపాటు జైలు జీవితం అనుభవించారని తెలిపారు. ఇంకా మూడున్నరేళ్ల జైలు శిక్ష మాత్రమే మిగిలి ఉందని.. ఈ దశలో శాసన సభ్యత్వం కోల్పోకుండా సీబీఐ కోర్టు తీర్పును సస్పెండ్‌ చేయాలని కోరారు. శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఇప్పటికే కర్ణాటక అసెంబ్లీ కార్యదర్శి గతనెలలో నోటిఫికేషన్‌ జారీ చేశారని.. ఖాళీ అయిన స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తే కోలుకోలేని నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. బెయిల్‌ విషయంలో ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయని సీబీఐ.. జైలుశిక్షను సస్పెండ్‌ చేసే విషయంలో వ్యతిరేకించింది. జస్టిస్‌ కే లక్ష్మణ్‌ ధర్మాసనం.. బుధవారం ఆదేశాలు వెలువరిస్తానని పేర్కొంది. ఇదే కేసులో నిందితురాలిగా ఉన్న ఐఏఎస్‌ శ్రీలక్ష్మి పిటిషన్‌ సైతం బుధవారం విచారణ జాబితాలో లిస్ట్‌ అయింది.

Updated Date - Jun 11 , 2025 | 04:56 AM