ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AIG hospitals: అప్రమత్తతతోనే ఫ్యాటీ లివర్‌కు చెక్‌

ABN, Publish Date - Jun 12 , 2025 | 02:56 AM

దేశంలో నానాటికీ ‘ఫ్యాటీ లివర్‌’ కేసులు పెరుగుతున్నాయని.. 24-30 శాతం మంది పిల్లల్లో సైతం ఈ సమస్య కనిపిస్తోందని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

  • ముందే గుర్తించాలి.. జీవనశైలి మార్చుకోవాలి

  • వ్యాయామం, ఆహార నియంత్రణ అవసరం

  • ‘గ్లోబల్‌ ఫ్యాటీ లివర్‌ డే’ సదస్సులో వైద్యులు

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): దేశంలో నానాటికీ ‘ఫ్యాటీ లివర్‌’ కేసులు పెరుగుతున్నాయని.. 24-30 శాతం మంది పిల్లల్లో సైతం ఈ సమస్య కనిపిస్తోందని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం, జీవనశైలి మార్చుకోవడం ద్వారా ఈ సమస్యకుచెక్‌ పెట్టవచ్చని ఆయన సూచించారు. వరల్డ్‌ ఫ్యాటీ లివర్‌ డే (ఏటా జూన్‌లో వచ్చే రెండో గురువారం) సందర్భంగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ‘యువర్‌ లివర్‌, యువర్‌ హెల్త్‌, యువర్‌ ఫ్యూచర్‌’ అనే అంశంపై ఓ సదస్సును నిర్వహించారు. ఏఐజీ ఆస్పత్రి హెపటాలజీ విభాగాధిపతి డాక్టర్‌ పి.నాగరాజారావు సంధానకర్తగా వ్యవహరించిన ఈ సదస్సులో పలువురు వైద్యనిపుణులు పాల్గొని ప్రసంగించారు. తొలు త ప్రసంగించిన డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి.. ఇప్పుడు కాలేయ వ్యాధుల చికిత్స గురించి కాకుండా నివారణ గురించి మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. ఫ్యాటీ లివర్‌ కారణంగా మధుమేహం తీవ్రత పెరిగే ప్రమాదం ఉందని, గుండె, జీర్ణక్రియ సమస్యలూ రావొచ్చని హెచ్చరించారు.

కాలేయంలో కొవ్వును కనీసం 10ు అయినా తగ్గించుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని.. వ్యాయామాలు చే యడం, ఆహార నియంత్రణలు పాటించడం వంటివి చేయాలని.. అప్పుడే ఈ సమస్యకు చెక్‌పెట్టగలమని చెప్పారు. సన్నగా ఉన్నంత మాత్రాన ఫ్యాటీ లివర్‌ లేదనుకోవడం అపోహ అని, మద్యం అలవాటు లేనివారికి కూడా ఫ్యాటీ లివర్‌ సమస్య వస్తుందని చెప్పారు. మగవారికి నడుం చుట్టుకొలత 90సెంటీమీటర్లు, ఆడవారికి 80 సెంటీమీటర్లు దాటితే జాగ్రత్త పడాలని ఈ సదస్సులో పాల్గొన్న వైద్యులు సూచించారు. అలా్ట్ర ప్రాసెస్డ్‌ ఆహారపదార్థాలు తినడం.. ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం, వ్యాయామా లు చేయకపోవడం వల్ల ఫ్యాటీ లివర్‌ సమస్య తీవ్రమవుతుందని హెచ్చరించారు. కాలేయంలో కొవ్వు చేరితే.. క్రమంగా అది ధమనులలోనూ చేరి గుండెపో టు, పక్షవాతానికి కారణమవుతుందన్నారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ సహకారంతో ఏఐజీ ఆస్పత్రి ఏఐ ఆధారిత టూల్‌ను తీర్చిదిద్దిందని.. దాన్ని ఉపయోగించి సీబీపీ, హెచ్‌బీఏ1సీ, ఎల్‌ఎ్‌ఫటీ, ట్రైగ్లిజరైడ్స్‌, బీఎంఐ ఆధారంగా ఫ్యాటీ లివర్‌ ముప్పున్న హైరిస్క్‌ రోగులను గుర్తించగలుగుతున్నామన్నారు.

Updated Date - Jun 12 , 2025 | 02:56 AM