ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Land Acquisition: ట్రిపుల్‌ ఆర్‌లో భూమి పోతోందని.. గుండెపోటుతో రైతు మృతి

ABN, Publish Date - Jun 04 , 2025 | 04:42 AM

ట్రిపుల్ ఆర్ రహదారి భూమిపోతోందన్న ఆవేదనలో సిద్దిపేటలో ఓ రైతు గుండెపోటుతో మరణించారు. తక్కువ పరిహారంతో అప్పుల్లో పడిన కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రభుత్వాన్ని ఉసరవద్దమని నిరసనలు చేస్తున్నారు.

మొదటిసారి నోటీసులు ఇచ్చినప్పుడు తల్లి.. ఇప్పుడు తండ్రిని పోగొట్టుకున్న పిల్లలు

మర్కుక్‌/నర్సాపూర్‌/శివ్వంపేట, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): ట్రిపుల్‌ ఆర్‌ రహదారి నిర్మాణంలో భూమిపోతోందన్న ఆవేదనతో ఓ రైతు గుండెపోటుతో మృతి చెందారు. సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం నరసన్నపేటలో మంగళవారం ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎంబరి భిక్షపతి అనే రైతుకు ట్రిపుల్‌ ఆర్‌ నిర్మాణంలో భూమిపోతోందంటూ రెండు రోజుల కింద ఆర్డీవో కార్యాలయం నుంచి నోటీసులు అందాయి. దీనితో మనోవేదనకు గురైన భిక్షపతి మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. భూసేకరణకు సంబంధించి తొలిసారి నోటీసులు ఇచ్చిన సమయంలోనే భిక్షపతి భార్య గుండెపోటుతో మరణించారని స్థానికులు, బంధువులు చెబుతున్నారు. సుమారు రూ.2 కోట్ల విలువ చేసే భూమికి కేవలం రూ.6 లక్షల పరిహారం ఇస్తామంటే ఎలాగని ప్రశ్నించారు. తల్లిదండ్రులను కోల్పయి ఇద్దరు పిల్లలు నిత్య (9) దీపిక (11) అనాథలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. భిక్షపతిది ప్రభుత్వ హత్యేనంటూ గ్రామస్థులు, బంధువులు ధర్నా చేశారు.


భూమికి పరిహారం రాలేదంటూ..

‘కుటుంబ పోషణ,ఇతర అవసరాల కోసం రూ.20లక్షల వరకు అప్పు అయింది. ట్రిపుల్‌ ఆర్‌ రోడ్డు కింద పోయిన భూమికిచ్చే పరిహారంతో అప్పులు తీర్చుదామనుకుంటే ఆ డబ్బులు రావడం లేదు. మా మూడెకరాల భూమి ఆక్రమణకు గురైంది. అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదు. అప్పు తీర్చేమార్గం కనిపించక పురుగుల మందు తాగుతున్నా..’ అంటూ మెదక్‌ జిల్లా కొత్తపేటలో కంచన్‌పల్లి చంద్రశేఖర్‌ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశారు. స్పందించిన స్థానికులు ఆయనను ఆస్పత్రికి తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ

ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..

For Telangana News And Telugu news

Updated Date - Jun 04 , 2025 | 04:42 AM