Farmer Suicide: అప్పులు తీర్చలేక అన్నదాత ఆత్మహత్య
ABN, Publish Date - May 23 , 2025 | 04:15 AM
పంటల దిగుబడి సరికా రాక, అప్పులు తీర్చే మార్గం కనిపించక ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం వెల్దిలో గురువారం జరిగింది.
విద్యుదాఘాతంతో రైతు మృతి
రఘునాథపల్లి, జైనథ్, మే 22 (ఆంధ్రజ్యోతి): పంటల దిగుబడి సరికా రాక, అప్పులు తీర్చే మార్గం కనిపించక ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం వెల్దిలో గురువారం జరిగింది. నూనెముంతల యాదగిరి(50) తనకున్న రెండెకరాల్లో పంటలు సాగు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే, పంటలు సరిగా పండకపోవడం, అప్పులు పెరిగిపోవడంతో జీవితంపై విరక్తితో గురువారం పొలంలో పురుగు మందు తాగాడు.
ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని సాంగ్వి(కె) గ్రామానికి చెందిన రైతు బోయర్ దాము(50) తనకున్న ఐదెకరాల భూమిలో పత్తి పంటను సాగు చేస్తున్నాడు. రోజూలాగే గురువారం ఉదయం దాము పొలానికి వెళ్లాడు. పొలంలో తెగి పడిన 33/11 కేవీ విద్యుత్ తీగలు గమనించని దాము వాటిపై కాలువేయడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.
Updated Date - May 23 , 2025 | 04:15 AM