Telangana Environment: ప్లాస్టిక్ రహిత రాష్ట్రం కోసం కృషి చేయాలి
ABN, Publish Date - Jun 04 , 2025 | 05:01 AM
ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్మూలించేందుకు తెలంగాణలో ప్రతి ఒక్కరూ సహకరించాలని పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం’ అనే థీమ్‌పై పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్లాస్టిక్ వాడకం వలన పర్యావరణం, మానవులు, వన్యప్రాణులకు కలిగే నష్టాలపై అవగాహన పెంచేందుకే ఈ ప్రచారం చేపట్టినట్లు తెలిపారు.
హైదరాబాద్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎవరూ ప్లాస్టిక్ వాడొద్దని, పర్యావరణానికి నష్టం కలిగించొద్దని కోరారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) రూపొందించిన ‘ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం’ థీమ్ పోస్టర్‌ను మంత్రి సురేఖ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పర్యావరణం, వన్యప్రాణులు, మానవ ఆరోగ్యంపై ప్లాస్టిక్ కాలుష్యం వల్ల కలిగే హానికరమైన ప్రభావాల గురించి అవగాహన పెంచడమే లక్ష్యంగా పోస్టర్లు రూపొందించారని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ
ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..
For Telangana News And Telugu news
Updated Date - Jun 04 , 2025 | 05:01 AM