ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇతర రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు ఉన్న 30 వేల మంది పేర్ల తొలగింపు

ABN, Publish Date - Jun 18 , 2025 | 06:16 AM

కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తాజా మార్గదర్శకాల ప్రకారం ‘డబుల్‌ ఓట్ల’ను గుర్తిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సుదర్శన్‌ రెడ్డి తెలిపారు.

  • జూబ్లీ హిల్స్‌ ఉప ఎన్నిక ఇప్పట్లో ఉండకపోవచ్చు: సీఈవో

హైదరాబాద్‌, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తాజా మార్గదర్శకాల ప్రకారం ‘డబుల్‌ ఓట్ల’ను గుర్తిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సుదర్శన్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన బీఆర్‌కేఆర్‌ భవన్‌లోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రెండుచోట్ల ఓటరుగా నమోదై ఉన్నవారిని సంప్రదించి.. వారి సూచన మేరకు ఒకచోట తొలగిస్తున్నామని చెప్పారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు తెలంగాణలో కూడా 58 వేల మంది ఓటు హక్కు కలిగి ఉన్నారని, అటువంటి వారి జాబితాను ఈసీఐ పంపిందన్నారు. ఆయా రాష్ట్రాల అధికారులతో సంప్రదింపులు జరిపి రెండు రాష్ట్రాల్లో ఓటరుగా నమోదై ఉన్నవారిలో 30 వేల మంది పేర్లను మన రాష్ట్రంలోని ఓటర్ల జాబితా నుంచి తొలగించామని తెలిపారు.

ఇప్పటివరకు ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో ఓటర్ల సంఖ్య 1500 ఉండగా.. దాన్ని ఈసీఐ 1000కి కుదించిందన్నారు. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ కేంద్రాలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల్లో తమ మొబైల్‌ ఫోన్లను డిపాజిట్‌ చేసేందుకు ఏర్పాట్లు చేయనున్నామన్నారు. ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి ఏమీ కాదని చెప్పారు జూబ్లీ హిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతిపై అసెంబ్లీ నుంచి తమకు సమాచారం వచ్చిందని, అసెంబ్లీ గెజిట్‌ను ఈసీఐకి పంపామన్నారు. ఇప్పటికే రెండు, మూడు రాష్ట్రాల్లో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నిక షెడ్యూల్‌ వచ్చిందని, జూబ్లీ హిల్స్‌ ఉప ఎన్నికకు ఇప్పట్లో నోటిఫికేషన్‌ రాకపోవచ్చన్నారు. అయితే ఉప ఎన్నిక ఎపుడు నిర్వహించాలనేది ఈసీఐ నిర్ణయిస్తుందని చెప్పారు.

ఆగస్టు 15 నుంచి స్వశక్తి మహిళలకు చీరల పంపిణీ

  • చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజ రామయ్యర్‌

సిరిసిల్ల, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మహిళా సంఘాల సభ్యులకు రెండు చీరలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆగస్టు 15 నుంచి ప్రారంభించనున్నట్లు చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి శైలజ రామయ్యర్‌ తెలిపారు. నేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు రెండు చీరలు ఇవ్వాలని నిర్ణయించిందని ఆమె చెప్పారు. మంగళవారం సమీకృత రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో చీరల ఉత్పత్తి పురోగతిపై ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివా్‌సతో కలిసి ఆమె సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు పవర్‌లూమ్స్‌ చీరల ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా శైలజ రామయ్యర్‌ మాట్లాడుతూ... ప్రభుత్వ రంగంలో ఉన్న అన్ని శాఖల నుంచి వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లు చేనేత సొసైటీలకు వస్తున్నాయని, రాబోయే రోజుల్లో దేవాదాయ శాఖ నుంచి మరో ఆర్డర్‌ వస్తుందన్నారు.

Updated Date - Jun 18 , 2025 | 06:16 AM