EBC welfare: ఈబీసీ కమిషన్ ఏర్పాటు చేయండి
ABN, Publish Date - Jul 11 , 2025 | 04:26 AM
రాష్ట్రంలో అగ్రవర్ణ పేదల అభ్యున్నతి కోసం ఆర్థికంగా వెనకబడిన తరగతుల (ఈబీసీ) కమిషన్, ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ఆర్థిక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఈబీసీ జాతీయ అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి కోరారు.
టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌కు ఈబీసీ జాతీయ అధ్యక్షుడి వినతి
రాష్ట్రంలో అగ్రవర్ణ పేదల అభ్యున్నతి కోసం ఆర్థికంగా వెనకబడిన తరగతుల (ఈబీసీ) కమిషన్, ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ఆర్థిక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఈబీసీ జాతీయ అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌ను ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ అగ్రవర్ణ పేదలకు కూడా వర్తింపచేయాలని విన్నవించారు. మహేశ్‌గౌడ్ స్పందిస్తూ.. ఈబీసీల సంక్షేమానికి కాంగ్రెస్ సర్కారు కృషి చేస్తుందని తెలిపారు.
Updated Date - Jul 11 , 2025 | 04:26 AM