R Krishnaiah: బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్‌ను అడ్డుకోవద్దు
ABN, Publish Date - Jul 16 , 2025 | 06:21 AM
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో తీసుకొచ్చిన 42 శాతం రిజర్వేషన్లపై జారీ చేసే ..
కోర్టుల్లో పిటిషన్లపై ఏ న్యాయవాదీ వాదించొద్దు : కృష్ణయ్య
బర్కత్‌పుర, జూలై 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో తీసుకొచ్చిన 42 శాతం రిజర్వేషన్లపై జారీ చేసే ఆర్డినెన్స్‌ను ఎవరూ అడ్డుకోవద్దని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టుల్లో పిటిషన్‌లు వేస్తే ఏ న్యాయవాది కూడా వాదించవద్దని కోరారు. మంగళవారం కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో హైకోర్టు బీసీ న్యాయవాదులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత ఏదైనా న్యాయపరమైన సమస్యలు ఎదురైతే సమర్థవంతంగా ఎదుర్కోవడానికి గల అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ జారీ చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. ఎవరైనా న్యాయస్థానాల ద్వారా బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే వాటిని నివారించడానికి సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో రాష్ట్ర ప్రభుత్వం కేవీయట్ పిటిషన్లను వేయాలని డిమాండ్ చేశారు.
Updated Date - Jul 16 , 2025 | 06:21 AM