ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rafale Fuselage: రాఫెల్‌ ఫ్యూజ్‌లాజ్‌ల తయారీ హైదరాబాద్‌లో

ABN, Publish Date - Jun 08 , 2025 | 05:31 AM

ఈ మేరకు ఫ్రాన్స్‌కు చెందిన, రాఫెల్‌ యుద్ధ విమానాలు తయారు చేసే దసో ఏవియేషన్‌కు, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌(టీఏఎ్‌సఎల్‌)కు మధ్య ఒప్పందం కుదరిందన్నారు.

దసో ఏవియేషన్‌, టీఏసీఎల్‌ మధ్య కీలక ఒప్పందం

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి

న్యూఢిల్లీ, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): రాఫెల్‌ యుద్ధవిమానాల్లో ప్రధాన భాగమైన ఫ్యూజ్‌లాజ్‌(విమానం మధ్య భాగం) హైదరాబాద్‌లో తయారు చేయనున్నారని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఫ్రాన్స్‌కు చెందిన, రాఫెల్‌ యుద్ధ విమానాలు తయారు చేసే దసో ఏవియేషన్‌కు, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌(టీఏఎ్‌సఎల్‌)కు మధ్య ఒప్పందం కుదరిందన్నారు. రాఫెల్‌ ఫ్యూజ్‌లాజ్‌ను ఫ్రాన్స్‌లో కాకుండా బయటిదేశాల్లో తయారు చేయనుండటం ఇదే తొలిసారని ఆయన శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2027-28లో హైదరాబాద్‌లో రాఫెల్‌ ఫ్యూజ్‌లాజ్‌ల ఉత్పత్తి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. రాఫెల్‌ ఫ్యూజ్‌లాజ్‌ల తయారీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభిస్తే తెలంగాణలో విమాన తయారీ పరిశ్రమ విస్తరిస్తుందని కిషన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. దేశీయ సంస్థలు అత్యాధునిక సాంకేతికతను, తయారీ సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. కాగా, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ హయాంలో భారత రక్షణ ఎగుమతులు వేగంగా పెరిగాయని కిషన్‌రెడ్డి చెప్పారు. 2013-14లో రూ.686కోట్ల నుంచి 2024-25 నాటికి రూ.23,622 కోట్లకు చేరి, 80కి పైగా దేశాలకు మన రక్షణ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని వివరించారు.


ఇవి కూడా చదవండి:

చిప్స్ ప్యాకెట్ చోరీ చేసినందుకు తిట్లు.. బాలుడి ఆత్మహత్య

భార్యకు నిప్పు పెట్టిన భర్త.. కోరిక తీర్చ లేదని..

Read Latest and Crime News


Updated Date - Jun 08 , 2025 | 05:31 AM