ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Damodara Rajanarsimha: ఇక ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ ఆకస్మిక తనిఖీలు

ABN, Publish Date - Feb 11 , 2025 | 05:38 AM

ఆసుపత్రులపై వరుసగా ఫిర్యాదులు వస్తుండటంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ కీలక నిర్ణయం తీసుకున్నారు.

  • అధికారులకు మంత్రి రాజనర్సింహ ఆదేశాలు!

  • లోపాలుంటే ఆసుపత్రిని సీజ్‌ చేసే అవకాశం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): ఆసుపత్రులపై వరుసగా ఫిర్యాదులు వస్తుండటంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వాస్పత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రులలోనూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన బృందాలను సిద్ధంగా ఉంచాలంటూ ఆయన వైద్య ఆరోగ్య శాఖాధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. తనిఖీల్లో తప్పిదాలను గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకోనున్నారు.


ప్రభుత్వాస్పత్రులలో వైద్యులు వేళలను పాటించకపోయినా, డ్యూటీలకు సరిగా హాజరు కాకపోయినా వెంటనే సస్పెండ్‌ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రైవేటు ఆస్పత్రుల తనిఖీల్లో లోపాలుంటే క్లినికల్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌ చట్టం ప్రకారం ఆస్పత్రిని సీజ్‌ చేయడం వంటి చర్యలు చేపట్టవచ్చని తెలుస్తోంది. కాగా, ఆర్‌ఎంపీ, పీఎంపీ డాక్టర్లకు ఎలాంటి గుర్తింపు ఇవ్వవద్దని జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. మెడికల్‌ కౌన్సిల్‌ కూడా ఈ అంశంపై సీరియ్‌సగా ఉందని, అర్హత లేకుండా వైద్యం చేసే ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులతో ప్రజల ఆరోగ్యానికి ప్రమాదమని తెలిపింది.


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read : కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికకు వెల్లువెత్తిన నామినేషన్లు

Also Read: ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి

For Telangana News And Telugu News

Updated Date - Feb 11 , 2025 | 05:38 AM