ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

COVID 19: వరంగల్‌లో కరోనా కలకలం

ABN, Publish Date - Jun 04 , 2025 | 05:32 AM

వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రి సమీపంలో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే జిల్లా వైద్య అధికారి ప్రజలను ఆందోళన చెందవద్దని, నగరంలో ఎలాంటి కొత్త కేసులు నమోదు కాలేదని స్పష్టం చేశారు.

ఒకే ఆస్పత్రిలో ఆరుగురికి పాజిటివ్‌

వరంగల్‌ మెడికల్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌ ఎంజీఎం సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో మంగళవారం ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తీవ్రమైన దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. అలాగే ఎంజీఎం ఆస్పత్రి పీజీ వైద్యురాలికి కూడా కరోనా నిర్ధారణ అయింది. నగరంలో ఒకే రోజు ఏడు పాజిటివ్‌ కేసులు నమోదుకావడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ విషయంపై వరంగల్‌ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బి.సాంబశివరావు స్పందించారు. నగరంలో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదని, ఇలాంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని తెలిపారు. కరోనా పట్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదని, తాము అప్రమత్తంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ

ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..

For Telangana News And Telugu news

Updated Date - Jun 04 , 2025 | 05:32 AM