Electrical: కాసులకు కనెక్షన్లు.. ఏఈల అక్రమ వసూళ్లకు అడ్డేలేదు
ABN, Publish Date - Mar 06 , 2025 | 09:42 AM
కాసులిస్తే నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ కనెక్షన్లు జారీ చేస్తూ కొంతమంది ఏఈలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. తక్కువ లోడ్లతో కొత్త కనెక్షన్లు జారీ చేస్తున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) నిబంధనల ప్రకారం 20 కిలోవాట్ల లోడ్‌కు మించి విద్యుత్ కనెక్షన్లు తీసుకోవాలంటే ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసుకోవాలి.
- నిబంధనలు వదిలేసి.. తక్కువ లోడ్ చూపిస్తూ.. బహుళ అంతస్తుల భవనాలకు విద్యుత్ కనెక్షన్ల జారీ
హైదరాబాద్ సిటీ: కాసులిస్తే నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ కనెక్షన్లు(Electrical connections) జారీ చేస్తూ కొంతమంది ఏఈలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. తక్కువ లోడ్లతో కొత్త కనెక్షన్లు జారీ చేస్తున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) నిబంధనల ప్రకారం 20 కిలోవాట్ల లోడ్‌కు మించి విద్యుత్ కనెక్షన్లు తీసుకోవాలంటే ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసుకోవాలి. విద్యుత్‌శాఖకు డీడీ రూపంలో డబ్బులు చెల్లించాలి.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: లంగర్‌హౌస్ ఘటన.. ఏఈ, ఈఎఫ్ఏ అవుట్
బేగంబజార్, జీడిమెట్ల, కూకట్‌పల్లి డివిజన్లతో పాటు యూసుఫ్‌గూడ, కృష్ణానగర్, గాజులరామారం(Yusufguda, Krishnanagar, Gajularamaram), డీపీపల్లి వంటి ప్రాంతాల్లో కొంతమంది ఏఈలు లోడ్ తగ్గించి విద్యుత్ కనెక్షన్లు జారీ చేస్తున్నారు. 5 కిలోవాట్ల లోడ్ సామర్థ్యం స్థానంలో 2 కిలోవాట్లుగా పేర్కొంటూ కనెక్షన్లు జారీచేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పబ్లిక్ డిస్ర్టిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లపై అదనపు లోడ్ పడుతోందని డిస్కం నిధులతో కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసేందుకు ఎస్టిమేషన్లు వేస్తున్నారు. పలు ప్రాంతాల్లో కొత్తగా నిర్మించే 5 నుంచి 6 అంతస్తుల భవనాలను ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్ లేకుండా విద్యుత్ కనెక్షన్లు జారీచేయడంతో పబ్లిక్ డిస్ర్టిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లపై ఓవర్‌లోడ్ పడి సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి.
ఈ వార్తను కూడా చదవండి: BJP victory: బీజేపీదే గెలుపు
ఈ వార్తను కూడా చదవండి: ఎస్సీ వర్గీకరణ.. బీసీ రిజర్వేషన్ల పెంపు!
ఈ వార్తను కూడా చదవండి: సీతారామ’తో ఖమ్మం జిల్లా సస్యశ్యామలం
ఈ వార్తను కూడా చదవండి: Heatwave: భానుడి భగభగలు
Read Latest Telangana News and National News
Updated Date - Mar 06 , 2025 | 09:42 AM