Former DSP: కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది.. మేనిఫెస్టో అమలు చేస్తామంటేనే ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి తప్పుకున్నా
ABN, Publish Date - Feb 22 , 2025 | 09:43 AM
ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పోలీస్ ఉద్యోగాన్ని వదులుకుని కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్(Karimnagar, Medak, Nizamabad, Adilabad) పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న తనను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మాజీ డీఎస్పీ ఎం. గంగాధర్ ఆరోపించారు.
- మాజీ డీఎస్పీ గంగాధర్
- ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆవేదన
హైదరాబాద్: ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పోలీస్ ఉద్యోగాన్ని వదులుకుని కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్(Karimnagar, Medak, Nizamabad, Adilabad) పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న తనను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మాజీ డీఎస్పీ ఎం. గంగాధర్(Former DSP M. Gangadhar) ఆరోపించారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ సంఘాల నాయకులు పోకల కిరణ్‌కుమార్ మాదిగ, దయానంద్ తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు.
ఈ వార్తను కూడా చదవండి: Actor Vijay: నెల తిరక్కమునుపే జిల్లా నేతలపై చర్యలు..
పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి మద్ధతు ఇస్తే తన మేనిఫెస్టోను అమలుచేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పడంతో తన నామినేషన్ ఉపసంహరించుకున్నానని ఆయన పేర్కొన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఎమ్మెల్యే కె.సత్యనారాయణ తనను పిలిపించుకుని నామినేషన్ ఉపసంహరించుకునేలా చేశారన్నారు. అయితే ఇప్పుడు తనను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.
పోకల కిరణ్ కుమార్ మాదిగ, దయానంద్ మాట్లాడుతూ.. చిన్నతనం నుంచి గంగాధర్ పేదరికం అనుభవించారని, కష్టపడి పోలీస్ శాఖలో డీఎస్పీ స్థాయికి ఎదిగారన్నారు. పోలీస్ శాఖలో ఎలాంటి మచ్చ లేకుండా విధులు నిర్వర్తించారని కొనియాడారు. అలాంటి వ్యక్తి ప్రజలకు సేవ చేయాలని ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ నేతలు మోసం చేయడం దారుణమన్నారు. గంగాధర్ రూపొందించిన మేనిఫెస్టో అమలుపై కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: పర్యాటకానికి అందం
ఈవార్తను కూడా చదవండి: Medak: రేవంత్ మాటలు కోటలు దాటుతున్నాయి
ఈవార్తను కూడా చదవండి: LRS: ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు నిర్ధారణ!
ఈవార్తను కూడా చదవండి: BJP.. కేసీఆర్ పాలనలోనే ఆర్థిక వ్యవస్థ కొల్లగొట్టారు
Read Latest Telangana News and National News
Updated Date - Feb 22 , 2025 | 09:43 AM