Hyderabad: సాంబార్ రైస్, నూడిల్స్‌లో బొద్దింకలు..
ABN, Publish Date - Jan 17 , 2025 | 07:48 AM
బేగంపేట టూరిజం ప్లాజా(Begumpet Tourism Plaza)లోని మినర్వా హోటల్‌లో ఆహారంలో బొద్దింక వచ్చిందని ఓ వ్యక్తి జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేశాడు. గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో హోటల్‌కు వెళ్లిన జీఎస్ రానా.. సాంబార్ రైస్ ఆర్డర్ చేశాడు. ఆహారం తింటుండగా.. బొద్దింక కనిపించింది.
- టూరిజం ప్లాజాలోని మినర్వా హోటల్‌పై ఫిర్యాదు
- నమూనాలు సేకరించిన అధికారులు
హైదరాబాద్ సిటీ: బేగంపేట టూరిజం ప్లాజా(Begumpet Tourism Plaza)లోని మినర్వా హోటల్‌లో ఆహారంలో బొద్దింక వచ్చిందని ఓ వ్యక్తి జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేశాడు. గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో హోటల్‌కు వెళ్లిన జీఎస్ రానా.. సాంబార్ రైస్ ఆర్డర్ చేశాడు. ఆహారం తింటుండగా.. బొద్దింక కనిపించింది. దీంతో ఆయన జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్(GHMC Food Safety Officer)కు ఫిర్యాదు చేసినట్టు చెప్పాడు. హోటల్‌లో అపరిశుభ్ర వాతావరణం నెలకొందని, కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఆహారం సిద్ధం చేస్తుండడంతో వినియోగదారుల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: శునకప్రియులకు ఓ శుభవార్త.. అదేంటంటే..
దీనిపై విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు నేపథ్యంలో హోటల్‌ను పరిశీలించిన ఫుడ్ సేప్టీ అధికారి శ్రీవేణిక(Food Safety Officer Srivenika) నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్(Lab)కు పంపారు. నివేదిక వచ్చిన అనంతరం తదుపరి చర్యలుంటాయని పేర్కొన్నారు. కాగా, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు సమీపంలోని సహార బేకరీలో ఓ వ్యక్తి నూడిల్స్ తింటుండగా బొద్దింక కనిపించింది. దీనిపై జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: Road Accident: తల్లీకుమార్తెను బలిగొన్న పొగమంచు
ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసా గురించి మంత్రి పొంగులేటి ఏం చెప్పారంటే..
ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసా కోసం దరఖాస్తు.. డిప్యూటీ సీఎం చెప్పింది ఇదే
ఈవార్తను కూడా చదవండి: TG News: తెలంగాణను వణికిస్తున్న పులులు
Read Latest Telangana News and National News
Updated Date - Jan 17 , 2025 | 07:48 AM