Hyderabad: శునకప్రియులకు ఓ శుభవార్త.. అదేంటంటే..
ABN , Publish Date - Jan 17 , 2025 | 07:25 AM
శునకప్రియులకు శుభవార్త. ఇంట్లో ఎంతో ఇష్టంగా పెంచుకునే కుక్కలకు ఓ ఇల్లు ఉంటే ఎలా ఉంటుంది.. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేని విధంగా కుక్కల(Dogs) కోసం ప్రత్యేకంగా విల్లాలు, పాడ్స్, డిజైనర్ ఫర్నిచర్‌ను అందించేందుకు బార్కిటెక్చర్ పేరుతో ఎస్‌వీఏజీ పెట్స్ హోమ్స్ ముందుకు వచ్చింది.

- పెంపుడు కుక్కకో ఇల్లు
- అందుబాటులోకి బార్కిటెక్చర్ డిజైన్లు
హైదరాబాద్: శునకప్రియులకు శుభవార్త. ఇంట్లో ఎంతో ఇష్టంగా పెంచుకునే కుక్కలకు ఓ ఇల్లు ఉంటే ఎలా ఉంటుంది.. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేని విధంగా కుక్కల(Dogs) కోసం ప్రత్యేకంగా విల్లాలు, పాడ్స్, డిజైనర్ ఫర్నిచర్‌ను అందించేందుకు బార్కిటెక్చర్ పేరుతో ఎస్‌వీఏజీ పెట్స్ హోమ్స్ ముందుకు వచ్చింది. శునకాలకు అద్భుతంగా ఇళ్లు నిర్మించి ఇవ్వడం ఈ సంస్థ ప్రత్యేకత. రెడ్‌హిల్స్(Red Hills)లోని ఫిక్కీలో గురువారం ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఎస్‌వీఏజీ సంస్థ ప్రత్యేకంగా కుక్కల కోసం తయారు చేసిన ఫర్నిచర్, ఇళ్లు, ఇతర వస్తువులను ఉంచింది.
ఈ వార్తను కూడా చదవండి: Cyber criminals: వృద్ధుడి నుంచి.. రూ. 10.90 లక్షలు కొల్లగొట్టారు
ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు సుశాంత్ కన్నెగంటి, విశాల్ బోత్రా, సహ వ్యవస్థాపకులు గోపాల్ వర్మ, అనుదీప్ వై మాట్లాడుతూ.. పెంపుడు కుక్కల కోసం విలాసవంతమైన గృహనిర్మాణాలు బార్కిటెక్చర్ కొత్త ట్రెండ్ అని అన్నారు. ప్రస్తుతం కుక్కలను పెంచుకునేందుకు దేశంలో అత్యధికులు ఆసక్తి చూపుతున్నారని, బార్కిటెక్చర్ అనేది పెంపుడు జంతువుల ప్రేమికులకు కొత్త ఇంటీరియర్స్ అందించేదన్నారు.
బార్చిటెక్చర్ ఉత్పత్తులను నగర వాసులకు అందుబాటులో ఉంచేందుకు అరాంఘర్‌లో తయారీ కేంద్రం ఉందని తెలిపారు. ప్రస్తుతం 25 రకాల ఉత్పత్తులు ఉన్నాయని, 50 డిజైన్లు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ప్రతి ఉత్పత్తిపై వచ్చే లాభాల ద్వారా వీధి కుక్కలకు సేవచేస్తామని వివరించారు. కార్యక్రమంలో ఎస్‌వీఏజీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Road Accident: తల్లీకుమార్తెను బలిగొన్న పొగమంచు
ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసా గురించి మంత్రి పొంగులేటి ఏం చెప్పారంటే..
ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసా కోసం దరఖాస్తు.. డిప్యూటీ సీఎం చెప్పింది ఇదే
ఈవార్తను కూడా చదవండి: TG News: తెలంగాణను వణికిస్తున్న పులులు
Read Latest Telangana News and National News