Cyber criminals: వృద్ధుడి నుంచి.. రూ. 10.90 లక్షలు కొల్లగొట్టారు
ABN , Publish Date - Jan 17 , 2025 | 07:02 AM
మనీ లాండరింగ్ కేసుల పేరుతో ఓ వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు(Cyber criminals) భయపెట్టి రూ.10.90 లక్షలు కాజేశారు. ఓ వ్యక్తి(75) ప్రైవేట్ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. సైబర్ నేరగాళ్లు అతడికి ఫోన్‌చేసి ముంబైలోని అంధేరి పోలీస్‌స్టేషన్(Andheri Police Station) నుంచి మాట్లాడుతున్నామని చెప్పారు.

- కేసుల పేరుతో భయపెట్టిన సైబర్ నేరగాళ్లు
- డిజిటల్ అరెస్ట్ అంటూ గదిలో నిర్బంధం.. ఆ పై డబ్బు బదిలీ
హైదరాబాద్ సిటీ: మనీ లాండరింగ్ కేసుల పేరుతో ఓ వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు(Cyber criminals) భయపెట్టి రూ.10.90 లక్షలు కాజేశారు. ఓ వ్యక్తి(75) ప్రైవేట్ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. సైబర్ నేరగాళ్లు అతడికి ఫోన్‌చేసి ముంబైలోని అంధేరి పోలీస్‌స్టేషన్(Andheri Police Station) నుంచి మాట్లాడుతున్నామని చెప్పారు. వీడియో కాల్‌లో పోలీసు దుస్తుల్లో ఉన్న వ్యక్తి పోలీస్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు.
ఈ వార్తను కూడా చదవండి: హైడ్రామాకు తెర
మీ ఆధార్ నంబర్‌తో పలు బ్యాంకు ఖాతాలు తెరిచారని, వాటి ద్వారా విదేశాలకు డబ్బు తరలిందని చెప్పాడు. ముంబై పోలీసులు మీపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారని, ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తామని బెదిరించాడు. డిజిటల్ అరెస్ట్ పేరుతో వృద్ధుడిని మూడు రోజులు గదిలో నుంచి కదలనీయలేదు. పలు రకాలుగా బెదిరించిన సైబర్ నేరగాడు.. మీకు మనీ లాండరింగ్ కేసులతో సంబంధం లేదని నిరూపించుకోవాలంటే బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాలన్నాడు.
ఖాతాలో ఉన్న మొత్తం ఆర్‌బీఐ ఖాతాకు బదిలీ చేయాలని, ఈ డబ్బు ఎలా వచ్చిందనే కోణంలో దర్యాప్తుచేసి, కేసుకు సంబంధం లేకుంటే మూడు రోజుల్లో డబ్బు మీ ఖాతాలో జమ అవుతుందని చెప్పాడు. సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మిన బాధితుడు రూ.10.90 లక్షలు వారు సూచించిన ఖాతాకు బదిలీ చేశాడు. మోసం జరిగినట్లు గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: Road Accident: తల్లీకుమార్తెను బలిగొన్న పొగమంచు
ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసా గురించి మంత్రి పొంగులేటి ఏం చెప్పారంటే..
ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసా కోసం దరఖాస్తు.. డిప్యూటీ సీఎం చెప్పింది ఇదే
ఈవార్తను కూడా చదవండి: TG News: తెలంగాణను వణికిస్తున్న పులులు
Read Latest Telangana News and National News