CM Revanth Reddy: అనునిత్యం ప్రజల కోసమే తపించారు!
ABN, Publish Date - Jul 28 , 2025 | 03:40 AM
దేశ, రాష్ట్ర రాజకీయాల్లో జైపాల్‌రెడ్డి ఒక ఉన్నత శిఖరమని.. ప్రజాస్వామ్యం, రాజకీయాల పట్ల లోతైన అవగాహన ఉన్న వ్యక్తి అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
దేశ రాజకీయాల్లో జైపాల్‌రెడ్డి ఉన్నత శిఖరం: సీఎం రేవంత్
హైదరాబాద్, జూలై 27 (ఆంధ్రజ్యోతి): దేశ, రాష్ట్ర రాజకీయాల్లో జైపాల్‌రెడ్డి ఒక ఉన్నత శిఖరమని.. ప్రజాస్వామ్యం, రాజకీయాల పట్ల లోతైన అవగాహన ఉన్న వ్యక్తి అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా సీఎం నివాళులర్పించి.. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రతి అంశంపై అద్భుతమైన వాగ్ధాటి, చతురత జైపాల్ సొంతమని.. విద్యార్థి నాయకుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా అనునిత్యం ప్రజల కోసమే పనిచేశారని కొనియాడారు.
తెలంగాణ రాష్ట్ర సాకారంలో జైపాల్‌రెడ్డి పోషించిన పాత్రను ప్రజలు మరిచిపోలేరని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఎన్నడూ విలువల విషయంలో రాజీపడలేదని, నిష్కళంక నేతగా, విలువలకు ప్రతీకగా నిలిచారని చెప్పారు. ఆయన ఆశయాలను, ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు నిజమైన నివాళిగా సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇటు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయనకు సీఎం నివాళులర్పించారు.
Updated Date - Jul 28 , 2025 | 03:40 AM