CM Revanth Reddy: ప్రతిపక్ష నేతకు ప్రజలు అక్కర్లేదా?
ABN, Publish Date - Jan 27 , 2025 | 03:58 AM
అధికారం లో ఉంటే చెలాయిస్తాం.. దానిని అడ్డుపెట్టుకుని కొల్లగొట్టడతామం టే ఎలా? అని అన్నారు. గ్రామం సర్పంచి ఊర్లో ఉండకపోతేనే ఒప్పుకోరని, అలాంటిది ప్రధాన ప్రతిపక్ష నేతను ఏమనాలని ప్రశ్నించారు.
ఏడాదిలో ఎన్నడైనా అసెంబ్లీకొచ్చారా?
పదేళ్లలో రేషన్ కార్డులు ఇవ్వాలనే సోయి కేసీఆర్, కేటీఆర్‌కు రాలేదు
పదవి లేకుండా సేవలో నా సోదరుడు
మేం ఇంటిల్లిపాదీ పదవులు తీసుకోలే
అర్ధరాత్రి నుంచే రైతు ఖాతాల్లో నగదు
మార్చి 31 దాకా 4 పథకాల నిరంతర అమలు: సీఎం రేవంత్‌రెడ్డి
నారాయణపేట జిల్లా చంద్రవంచలో సంక్షేమ పథకాల ప్రారంభం
మహబూబ్‌నగర్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘‘అసెంబ్లీ లో ప్రజా సమస్యలను లేవనెత్తి.. వాటి పరిష్కారానికి మార్గం చూపాలి. కానీ, ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ 13 నెలలుగా ఒక్కనాడూ శాసనసభకు రాకుండా ప్రజలంటే అక్కర్లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. అధికారం లో ఉంటే చెలాయిస్తాం.. దానిని అడ్డుపెట్టుకుని కొల్లగొట్టడతామం టే ఎలా? అని అన్నారు. గ్రామం సర్పంచి ఊర్లో ఉండకపోతేనే ఒప్పుకోరని, అలాంటిది ప్రధాన ప్రతిపక్ష నేతను ఏమనాలని ప్రశ్నించారు. ఆదివారం నారాయణపేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల పథకాల అమలుకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన సోదరుడికి ఏపదవి ఉందంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారని, కానీ.. తాము వారిలాగా ఇంటిల్లిపాదీ పదవులు తీసుకోలేదని ఎద్దేవా చేశారు. తన సోదరుడు పదవులు లేకుండా ప్రజాసేవ చేస్తుంటే కళ్లలో నిప్పులు ఎందుకు పోసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రాష్ట్రంలో తిరుగుతున్నప్పుడు నియోజకవర్గంలో తన సోదరుడు తి రుపతిరెడ్డి అందుబాటులో ఉంటున్నారని తెలిపారు.
ఈ 13 నెలల్లో గ్రామాలకు అధికారులను, ఎమ్మెల్యేలను, చివరకు సీఎంను దగ్గర చేశామని చెప్పారు. గతంలో మాదిరిగా పని కావాలంటే ఫామ్‌హౌ్‌సకు వెళ్లే అలవాటు నుంచి ప్రజల వద్దకే అందరూ వెళ్లే లా విధానాన్ని మార్చామన్నారు. పామ్‌హౌ్‌సలలో ఉండి పాలన చేస్తామంటే ఇకపై కుదరదని హెచ్చరించారు. మేధావులుగా చెప్పుకొనే కేసీఆర్, కేటీఆర్‌లకు పదేళ్లుగా పేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలనే కనీస జ్ఞానం లేకపోవడం విచారకరమన్నారు. భూమికి, విత్తనానికి ఎంత బలమైన బంధం ఉందో.. రైతుకు, కాంగ్రె్‌సకు మధ్య అంతే బలమైన బంధం ఉందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 25.50 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. రైతు భరోసా పథకం కింద గతంలో ఉన్న రూ.10 వేలను రూ.12 వేలకు పెంచామని, ఆదివారం అర్ధరాత్రి నుంచే టకీ టకీమని రైతుల ఖాతాల్లో డబ్బు లు జమ అవుతాయని చెప్పారు. భూమిలేని పేదలకు కూడా మొదటి విడతగా జమ అవుతాయన్నారు. మార్చి 31 వరకు పథకాల అమలు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, చివరి అర్హుడి వరకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. రేషన్ కార్డులు లేని వారంందరికీ కార్డులు ఇస్తామని, బతకడానికి వలస పోయిన వారు కూడా వచ్చి కార్డులు తీసుకుంటే.. సన్నబియ్యం పంపిణీ ఇస్తామని చెప్పారు.
కొడంగల్ అభివృద్ధిపై కక్ష ఎందుకు?
దశాబ్దాలుగా కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని సీఎం రేవంత్ అన్నారు. తమకు ఇప్పుడు రాష్ట్రానికే ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చినందున.. ఇక్కడ 40 వేల మందికి ఉపాధి దొ రుకుతుందనే ఉద్దేశంతో 1300 ఎకరాల భూమి సే కరించాలనుకున్నామని తెలిపారు. కానీ, భూసేకరణ కు వచ్చిన అధికారులపై దాడులు చేసి, రాళ్లతో కొట్టి, హత్య చేసేందుకు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్ ప్రాంత ప్రజలు ఇంకా పేదరికంలోనే ఉండాలని కోరుకుంటున్నారా? అని నిలదీశారు. పదేళ్లలో పాలమూరు-రంగారెడ్డి పూర్తిచేయలేదని, నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం ఊసే ఎత్తలేదని.. అప్పుడు ఎవరు అడ్డుపడ్డారని ప్ర శ్నించారు. ఇప్పుడు తాము ఆ పథకాలను పూర్తి చేయడానికి బాధ్యత తీసుకుంటుంటే.. కాళ్లలో కట్టె లు పెడుతున్నారని ఆరోపించారు. అందరి గొంతు, మాట, బాట ఒక్కటే అయితే ఎవరు అడ్డుపడినా.. తొక్కుకుంటూ వెళ్లి.. అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. దావో్‌సలో నాలుగు రోజులు పర్యటిం చి.. అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చానని ఆయన చెప్పారు.
అమరవీరులకు సీఎం నివాళి
అల్వాల్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ, ఆంధ్రా సబ్ ఏరియా (టాసా) ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని ఆర్మీ పరేడ్ గ్రౌండ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అమరవీరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడ ఉండే రికార్డులో తన సందేశాన్ని రాశారు. ఈ సందర్భంగా త్రివిధ దళాలకు చెందిన అధికారులు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో మేజర్ జనరల్ అజయ్ మిశ్రా, మాజీ సైనికులు, త్రివిధ దళాల ఉన్నాతాధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Vijayasai Reddy: విజయసాయిరెడ్డి భవిష్యత్తు ప్లాన్ ఇదేనా..!
Republic Day.. ఏపీలో రిపబ్లిక్ వేడుకలు.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..
Republic Day.. బీజేపీకి రాజ్యాంగం అంటే గౌరవం లేదు: వైఎస్ షర్మిల
Updated Date - Jan 27 , 2025 | 03:59 AM