ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Provident Fund: ప్రజావాణి ద్వారా.. అందిన 4 లక్షల పీఎఫ్‌ డబ్బు

ABN, Publish Date - Jun 04 , 2025 | 04:56 AM

సీఎం ప్రజావాణి చొరవతో ఐదేళ్ల క్రితం ప్రమాదవశాత్తు యిన పాల ప్రవీణ్‌ కుటుంబానికి రూ.4 లక్షల ప్రావిడెంట్ ఫండ్ అందింది. అధికారులు జాగ్రత్తగా వ్యవహరించి కుటుంబానికి డబ్బును అందజేశారు.

బేగంపేట, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): సీఎం ప్రజావాణి చొరవతో పాల ప్రవీణ్‌ అనే వ్యక్తి కుటుంబానికి రూ.4 లక్షల ప్రావిడెంట్‌ ఫండ్‌ అందింది. మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో మంగళవారం జరిగిన సీఎం ప్రజావాణికి అతడి తల్లిదండ్రులు పాల నాగేశ్వరరావు, రామలక్ష్మి వచ్చి ఈ విషయాన్ని తెలిపారు. హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టకు చెందిన పాల ప్రవీణ్‌ ప్రైవేటు సంస్థలో పనిచేస్తుండగా ఐదేళ్ల క్రితం ప్రమాదవశాత్తు చనిపోయారు. అప్పటి నుంచి అతడి తల్లిదండ్రులు పీఎఫ్‌ డబ్బు కోసం అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. దాంతో మూడు నెలల క్రితం సీఎం ప్రజావాణికి వచ్చి సమస్యను వివరిస్తూ వినతి పత్రం ఇచ్చారు. ప్రజావాణి ఇన్‌చార్జి చిన్నారెడ్డి, నోడల్‌ అధికారి దివ్య దేవరాజన్‌ అధ్వర్యంలో అధికారులు రంగంలోకి దిగి ప్రైవేట్‌ సంస్థ, పీఎఫ్‌ అధికారులతో మాట్లాడి ప్రవీణ్‌కు రావాల్సిన 4 లక్షల పీఎఫ్‌ డబ్బును తల్లిదండ్రులకు ఇప్పించారు. దీంతో వారు మంగళవారం ప్రజావాణికి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, చిన్నారెడ్డి, నోడల్‌ అధికారి దివ్యలకు ధన్యవాదాలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబుతో హీరో అక్కినేని నాగార్జున భేటీ

ఏపీ కేబినెట్ భేటీ.. ఎప్పుడంటే..

For Telangana News And Telugu news

Updated Date - Jun 04 , 2025 | 04:57 AM